Mahesh, Rajamouli: జక్కన్న డైరెక్షన్ లో మహేష్ ఎప్పుడో నటించాడా.. ఏం జరిగిందంటే?

మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చే ఏడాది నుంచి ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మహేష్ రాజమౌళి కాంబోలో ఈ సినిమా తొలి సినిమా కావడంతో అటు మహేష్ ఫ్యాన్స్ ఇటు రాజమౌళి ఫ్యాన్స్ ఈ సినిమా కొరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కాగా కేఎల్ నారాయణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.అయితే పాతికేళ్ల క్రితమే మహేష్ జక్కన్న కాంబోలో మూవీ తెరకెక్కిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం హాట్ టాపిక్ అవుతోంది.

మహేష్ రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రాజకుమారుడు సినిమా తెరకెక్కగా ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమాలోని కొన్ని చిన్నచిన్న షాట్స్ జక్కన్న తీశారని భోగట్టా. ఈ విధంగా పాతికేళ్ల క్రితమే జక్కన్న మహేష్ సినిమా కోసం పని చేశారు. ఈ కాంబినేషన్ లో 25 సంవత్సరాల తర్వాత అటు మహేష్ ఇటు రాజమౌళి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుని సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా కచ్చితంగా ఫ్యాన్స్ ను మెప్పించనుందని కమర్షియల్ గా సరికొత్త రికార్డులను క్రియేట్ చేయనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహేష్ జక్కన్న కాంబో మూవీ హాలీవుడ్ లెవెల్ లో ఉండనుందని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీలో ఇతర భాషల కీలక నటులు సైతం నటించనున్నారని సమాచారం అందుతోంది.

మహేష్ (Mahesh) రాజమౌళి కాంబో మూవీలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉండనున్నాయని, విదేశీ ప్రేక్షకులకు సైతం నచ్చేలా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీ రిలీజ్ కోసం మూడు నుంచి నాలుగేళ్ల ఎదురుచూపులు తప్పవని భోగట్టా.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus