RRR: ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ గురించి షాకింగ్ అప్ డేట్.. షూట్ అప్పుడేనా?

రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఫుల్ రన్ లో 1200 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా ద్వారా నిర్మాత దానయ్యకు 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం లాభం వచ్చింది. ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జక్కన్న మహేష్ తో సినిమాను పూర్తి చేసిన వెంటనే ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ ను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. సీక్వెల్ లో ఇద్దరు హీరోల పాత్రలకు సమ ప్రాధాన్యత ఉండేలా రాజమౌళి జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మొదట వేరే డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కిస్తారని ప్రచారం జరిగినా రాజమౌళి ఈస్ సినిమా సీక్వెల్ ను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీకి ఎప్పుడు సీక్వెల్ తెరకెక్కినా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడ ఖాయమని చెప్పవచ్చు.

ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ సీక్వెల్ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో ఇతర దేశాల ప్రేక్షకులు సైతం ఈ సినిమాపై దృష్టి పెట్టారు. ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారతీయ సినీ చరిత్రలో ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.

ఆర్ఆర్ఆర్ మూవీ సీక్వెల్ ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. రాజమౌళి సినిమాలలో యాక్షన్ సీక్వెన్స్ లు స్పెషల్ గా ఉంటాయనే సంగతి తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సైతం ఈ సినిమా సీక్వెల్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతోంది. ఆర్ఆర్ఆర్ మూవీ సక్సెస్ తో అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు క్రేజ్ పెరుగుతోంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus