Chiru, Balayya: చిరు – బాలయ్య రాబోయే సినిమాల్లో ఏం యాడ్ చెయ్యబోతున్నారంటే..?

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత పాండమిక్ గ్యాప్ రాకుండా ఉండి ఉంటే.. మరో రెండు సినిమాలు రిలీజ్ చేసుండేవారు.. 65 ఏళ్లు దాటినా యంగ్ హీరోలకు పోటీనిస్తూ.. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు లైన్‌లో పెడుతూ తనకు తానే సాటి అని ప్రూవ్ చేస్తున్నారు.. గతేడాది ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ విడుదల చేసి.. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ గా బ్లాక్ బస్టర్ కొట్టారు.. మార్చి 3 నాటికి విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంటుందీ చిత్రం..

‘వాల్తేరు వీరయ్య’ విజయంతో తన నుండి ప్రేక్షకాభిమానులు ఏం కోరుకుంటున్నారో అర్థమయిందని.. తన ట్రేడ్ మార్క్ ట్రాక్ తప్పకుండా.. ప్రయోగాల జోలికి పోకుండా పక్కా మాస్ మసాలా మూవీస్ చేయాలని డిసైడ్ అయినట్టు ఇటీవల చెప్పారు చిరు.. అందుకే ‘భోళా శంకర్’ స్క్రిప్ట్‌లో అవసరమైన చోట మార్పులు చేర్పులు చేయిస్తున్నారు.. పనిలో పనిగా తన పాటను తానే రీమిక్స్ చేయబోతున్నారు మెగాస్టార్.. ‘చూడాలని ఉంది’ లో ‘రామ్మా చిలకమ్మా’ సాంగ్ ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్..

దీన్ని వచ్చే సినిమాలో మాంచి ఊపుతో రీమిక్స్ చేయనున్నారనే వార్త వైరల్ అవుతోంది..ఇక నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టి హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నారు.. ఓటీటీలోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు.. బాలయ్య ఇప్పటి వరకు తను నటించిన కొన్ని సినిమాల్లో తండ్రి ఎన్టీఆర్ సాంగ్స్ కొన్ని రీమిక్స్ చేశారు.. ఈసారి తన పాటకు తానే తిరిగి స్టెప్పులెయ్యాలనుకుంటున్నారట..

బాలయ్య కెరీర్‌లోని బిగ్గెస్ట్ అండ్ ఇండస్ట్రీ హిట్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన ‘సమర సింహా రెడ్డి’ లోని ‘అందాల ఆడబొమ్మ’ సాంగ్ ఆల్ టైం క్లాసిక్ అండ్ లవ్లీ మెలోడీ.. ఇప్పుడీ పాటను అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న NBK 108 మూవీలో పెట్టాలనే ఆలోచనలో ఉన్నారట నటసింహం.. ఒకవేళ చిరు – బాలయ్య తమ ఎవర్ గ్రీన్ పాటలను తామే రీమిక్స్ చేస్తు కనుక థియేటర్లు షేక్ అవడం ఖాయం అంటున్నారు మెగా అండ్ నందమూరి ఫ్యాన్స్..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus