Trisha, Mansoor: త్రిష-మన్సూర్ అలీ ఖాన్ మధ్య గోడవకు పుల్ స్టాఫ్ పెట్టిన స్టార్ హీరో..!

తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేప్ సీన్స్ గురించి మాట్లాడారు. చాలామంది హీరోయిన్స్‌తో రేప్ సీన్‌లో నటించానని ‘లియో’ సినిమాలో త్రిషతో కూడా రేప్ సీన్ ఉంటుందని అనుకున్నానని, కానీ లేనందుకు బాధపడ్డానంటూ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మన్సూర్ వ్యాఖ్యలను చిరంజీవి, లోకేష్ కనగరాజ్, మాళవిక మోహనన్, డైరెక్టర్ కార్టీక్ సుబ్బరాజు, చిన్మయి, నితిన్ వంటివారు తీవ్రంగా ఖండించారు. అతడిని బ్యాన్ చేయాలని, అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో అనేకమంది డిమాండ్ చేసారు.

మన్సూర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన త్రిష ఇకపై అతనితో కలిసి నటించేది లేదని స్పష్టం చేశారు. దానిపై వివరణ ఇచ్చిన మన్సూర్ తన ఇంటర్వ్యూ మొత్తం చూడకుండా మాట్లాడుతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తనకు కూడా కూతురు ఉందని, ఫ్యామిలీ ఉందని దీనిని కొందరు కావాలని పెద్ద ఇష్యూ చేస్తున్నారంటూ కామెంట్స్ చేశారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం ఆయనని హెచ్చరిస్తూ నోటీసులు పంపింది. త్రిషకు సమాధానం చెప్పాలని కోరింది.

అయితే సినిమా ఇండస్ట్రీ మొత్తం హీరోయిన్ (Trisha) త్రిష వైపు వెళ్లడంతో మన్సూర్ అలీ ఖాన్ దిగిరాక తప్పలేదు. నేను తప్పు చేయలేదు నేను సారీ చెప్పను అంటూ వీర వీగిన ఆయనే త్రిషకు బహిరంగ క్షమాపనులు చెప్పారు . ఫైనల్లీ మన్సూర్ అలీ ఖాన్ త్రిష కు బహిరంగ క్షమాపనులు చెప్పారు . “కత్తి లేకుండా వారం రోజులపాటు యుద్ధం చేశానని .. ఈ యుద్ధంలో ఎటువంటి రక్తపాతం లేకుండానే గెలిచానని నా వ్యాఖ్యలు త్రిషకు బాధ కలిగిచుంటే సారీ “అంటూ మన్సూర్ అలీ ఖాన్ మీడియా ప్రకటన ద్వారా సారీ చెప్పారు.

దీనిపై త్రిష తప్పు చేయడం మానవత్వం క్షమించడం దైవం అంటూ ట్వీట్ పెట్టింది, దీనితో ఈ వివాదానికి తెరపడినట్లుగా అంతా భావిస్తున్నారు . అయితే మన్సూర్ అలీ ఖాన్ ఇలా సడన్ గా త్రిషకు సారీ చెప్పడం వెనుక కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో హస్తం ఉందని ఆయనే ఈ వివాదాన్ని సర్దుమనిగేలా ఇలా కూల్ గా సారీ తో మ్యాటర్ ని క్లోజ్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ స్టార్ హీరో ఎవరు అనేది తెలియాల్సింది ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus