Prabhas: ప్రభాస్‌ సినిమాకు విలన్‌ కావాలా? ఇదిగో ఉన్నాడు!

టాలీవుడ్‌లో హీరో – విలన్‌గా నటించిన స్నేహితులు అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లలో ప్రభాస్‌ – గోపీచంద్‌ కాంబో ఒకటి. ‘వర్షం’ సినిమాలో వీరి ఫేస్‌ ఆఫ్‌ ఓ లెవల్‌లో ఉంటుంది. ఆ సినిమా తర్వాత ఇద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు. దీంతో వీరిద్దరి ఫ్యాన్స్‌ చాలా రోజులుగా వెయిట్‌ చేస్తున్నారు. అలాంటివారికి గోపీచందర్‌ ఆసక్తికరమైన మాట చెప్పాడు. అంతేకాదు ప్రభాస్‌ కోసం మంచి విలన్‌ను వెతుకుతున్నవాళ్లకు కూడా ఇది గుడ్‌ న్యూస్‌ అనే చెప్పాలి.

ప్రస్తుతం భారతీయ సినిమాలో పాన్‌ ఇండియా మూవీస్‌ ట్రెండ్‌ నడుస్తోంది. దాంతోపాటు ఒక భాషలోని హీరోలు మరో భాషలో నటించడమూ పెరిగింది. విలన్‌ అవతారం ఎత్తడానికి హీరోలు కూడా ముందుకొస్తున్నారు. గోపీచంద్‌ కూడా ఇప్పుడు అదే మాట అంటున్నాడు. ఒక పాన్ ఇండియా సినిమా అందులోనూ మల్టీ స్టారర్ చెయ్యాల్సి వస్తే ప్రభాస్‌తో చేస్తానని చెప్పాడు గోపీచంద్. అయితే అది విలన్‌గానా, లేక హీరోగానే అనేది చెప్పలేదు. గోపీచంద్‌ విలనిజం చేస్తే ఎలా ఉంటుందో మనం ఇప్పటికే చూశాం.

కెరీర్‌ ప్రారంభంలో సినిమాలు లేవు అనుకుంటున్న సమయంలో ‘జయం’, ‘నిజం’, ‘వర్షం’ అంటూ విలనిజం పండించారు. అందులో క్రూరమైన విలన్‌గా గోపీచంద్‌ పర్‌ఫార్మెన్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ప్రభాస్‌తో అలాంటి ఓ సినిమా కుదిరితే ఫ్యాన్స్‌కి పండగ అని చెప్పొచ్చు. ప్రభాస్‌ ఇటీవల కాలంలో వరుసగా సినిమాలు ఓకే చేసేస్తున్నాడు. అందులో ఎందులో అయినా విలన్‌ కావాలంటే గోపీచంద్‌ను పరిశీలించొచ్చు. ఇక గోపీచంద్‌ సినిమాల సంగతి చూస్తే.. మారుతి దర్శకత్వంలో నటించిన ‘పక్కా కమర్షియల్‌’ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది.

శ్రీవాస్‌ దర్శకత్వంలో ఓ సినిమాలలో నటిస్తున్నాడు గోపీచంద్‌. ఆ తర్వాతి సినిమాల విషయంలో స్పష్టత లేదు. అయితే తమిళ దర్శకుడు హరి డైరక్షన్‌లో ఓ సినిమా చేస్తాడని అంటున్నారు. ఎన్టీఆర్‌కు చెప్పిన కథనే హరి.. గోపీచంద్‌కి చెప్పారని, చర్చలు జరుగుతున్నాయని టాక్‌. మరి ఈ సినిమా ఓకే చేస్తారా? లేక వేరేది ఓకే అవుతుందా? అనేది చూడాలి.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus