హీరోయిన్ల కెరీర్లో ఒకేవారం లేదా ఒకేరోజు వాళ్లు నటించిన రెండు సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది సర్వసాధారణం. డేట్ల ఇష్యూ వల్లనో లేక మరికొన్ని కారణాల వల్లనో ఇలా జరుగుతూనే ఉంటుంది. గతంలోనూ పలువురు హీరోయిన్ల విషయంలో ఇలానే జరిగింది. ఇటీవల ఆ రేర్ ఫీట్ ను దక్కించుకున్న హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని. మలయాళంలో ఆమె నటించిన “ఓడుం కుతిర చాడుం కుతిర”, “కొత్త లోక” ఒకేరోజు విడుదలయ్యాయి. అందులో “కొత్త లోక” ఏకంగా 100 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా, మరో సినిమా మాత్రం కనీసం విడుదలైన విషయం కూడా ఎవరికీ తెలియకుండాపోయింది.
ఇక్కడ విశేషం ఏమిటంటే.. “కొత్త లోక” టీమ్ మొత్తం దాదాపుగా కొత్తవాళ్లే. నిజానికి ఈ సినిమా మీద భారీ అంచనాలు కూడా లేవు. కానీ.. “ఓడుం కుతిర చాడుం కుతిర” మాత్రం మలయాళంలో పెద్ద సినిమా కింద లెక్క. ఎందుకంటే ఆ సినిమాను డైరెక్ట్ చేసిన అల్తాఫ్ సలీం నటుడిగా చాలా పాపులర్. ఇక సినిమా హీరో ఫహాద్ ఫాజిల్ కావడం, మలయాళ ప్యాడింగ్ ఆర్టిస్టులు అందరూ ఉండడంతో సినిమా మీద మంచి అంచనాలు నమోదయ్యాయి.
రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కావడంతో ట్రేడ్ వర్గాలు ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది అనుకున్నారు. కట్ చేస్తే.. “ఓడుం కుతిర చాడుం కుతిర”కి కనీస స్థాయి కలెక్షన్స్ కూడా రాలేదు. ఈ విధంగా భారీ అంచనాల నడుమ విడుదలైన “ఓడుం కుతిర చాడుం కుతిర” చిత్రం ఫ్లాప్ ను ఎలాంటి అంచనాలు లేని “కొత్త ఒక” కవర్ చేయడమే కాక, ఆమెను స్టార్ హీరోయిన్ గా నిలిపింది.
ప్రస్తుతం ఆమెకి తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీల నుండి కూడా వరుస ఆఫర్లు వస్తాయి. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడంతో అతడికి మంచి లాభాలు కూడా వచ్చాయట. ఏదేమైనా కల్యాణి జాతకం అదిరిందని చెప్పాలి.