Mahesh Babu: మహేష్ అంటే మరి ఇంత అభిమానమా..వీడియో వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు మహేష్ బాబు ఒకరు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి మహేష్ బాబు ఇండస్ట్రీలో ఎంతమంది సక్సెస్ అందుకున్నారు. కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైనటువంటి మహేష్ బాబు భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఈయన సినిమాలు మాత్రమే కాకుండా ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేస్తూ కూడా భారీ స్థాయిలో సంపాదిస్తున్నారు.

ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు ఆయన సంపాదించిన దానిలో కొంత భాగం పేద వారికోసం ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించి ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి బంగారు భవిష్యత్తు అందిస్తున్నారు. అనాధ పిల్లలను చేరదీసి వారిని చదివిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు అదేవిధంగా పలు గ్రామాలను దత్తత తీసుకొని గ్రామాల అభివృద్ధికి దోహదం చేస్తున్నారు.

ఇక కొన్ని వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించి వారికి పునర్జన్మను కల్పించి నిజజీవితంలో కూడా హీరో అని అనిపించుకున్నారు. ఇలా మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారని చెప్పాలి. ఇకపోతే తాజాగా ఈయన తెలంగాణలో జరిగిన ఎన్నికలలో భాగంగా ఓటు వేయడం కోసం రాగ అందుకు సంబంధించినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా ఒక అభిమాని మహేష్ బాబుని వెనకనుంచి తాగి ఆ చేతిని తన గుండెలకు హత్తుకొని నమస్కరించుకున్నారు.

సాధారణంగా మనం భగవంతుడిని నమస్కరించుకునే సమయంలో అలా చేస్తాము కానీ ఈయన మహేష్ బాబును తాకి ఆ పని చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పై ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేస్తూ మహేష్ బాబు రూపంలో సాక్షాత్తు దేవుడే నడిచి వచ్చినట్టు ఉంది అందుకే ఆ అభిమాని అలాంటి పని చేశారు అంటూ కామెంట్లు చేయగా ఎంతో మంది చిన్న పిల్లలకు పునర్జన్మను కల్పించినటువంటి వారిని దేవుడితో సమానంగానే భావిస్తారు అంటూ ఈ వీడియో పై ఎంతో మంది నెటిజన్స్ కామెంట్లు చేస్తూ మహేష్ బాబు (Mahesh Babu) మంచితనం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus