Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ పై డైరెక్టర్ కామెంట్స్ వైరల్..!

అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘ఎఫ్3’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తూనే మరోపక్క కిరణ్ కొర్రపాటి అనే యువ దర్శకుడితో ‘గని’ అనే మూవీ కూడా చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇది పూర్తిగా స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది. ‘ఎఫ్3’ కంటే ముందే ఈ సినిమా షూటింగ్ మొదలైంది.కానీ గత ఏడాది లాక్ డౌన్ ఏర్పడటంతో వాయిదా పడింది. లాక్ డౌన్ ముగిశాక మళ్ళీ షూటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది ‘గని’ చిత్రం.

అయితే ‘ఈ చిత్రం దర్శకుడు కిరణ్ కు అలాగే హీరో వరుణ్ కు మ‌ధ్య గొడవయ్యింది’ అంటూ కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ చిత్రం ఔట్ పుట్ బాలేదని వ‌రుణ్ చెప్పడంతో గొడవ స్టార్ట్ అయ్యిందని గుసగుసలు వినిపించాయి.ఈ మధ్యనే ఈ చిత్రం కోసం వేసిన సెట్ ను కూడా తీసేయడంతో ఆ ప్రచారానికి మరింత బ‌లం చేకూరినట్టు అయ్యింది. అయితే ఈ వార్తల్లో ఎంత మాత్రం నిజం లేదని తాజాగా ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర‌పాటి క్లారిటీ ఇచ్చాడు.ఆయన మాట్లాడుతూ..

‘ ‘గని’ మూవీకి ముందు నుండీ వరుణ్ తేజ్ మెయిన్ పిల్ల‌ర్ గా ఉన్నాడు. సినిమా ఔట్ పుట్ బాగా వచ్చింది. అతనికి కూడా బాగా న‌చ్చింది. ఇలాంటి వార్త‌లు ఎక్క‌డ నుండీ పుట్టుకొచ్చాయో నాకైతే అర్థం కావ‌డంలేదు.క‌రోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.దాంతో అనవసరంగా రెంట్ కూడా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఆ కారణంతోనే సెట్ ను తొలగించాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus