సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’.డెన్నిస్ జీవన్ కానుకొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘వెంకటాద్రి టాకీస్’ బ్యానర్ల పై టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం వంటి వారు కలిసి నిర్మించారు. హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి ‘ధృవ’ ఫేమ్ హిప్ అప్ తమిజా సంగీత దర్శకుడు. మార్చి 5న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షో నుండే హిట్ టాక్ రావడంతో మంచి ఓపెనింగ్స్ ను సాధించింది ఈ చిత్రం.మొదటిరోజు కంటే 3వ రోజున ఈ చిత్రం బాగా కలెక్ట్ చేసిందని చెప్పాలి.
ఇక ఈ చిత్రం 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 0.97 cr |
సీడెడ్ | 0.31 cr |
ఉత్తరాంధ్ర | 0.43 cr |
ఈస్ట్ | 0.29 cr |
వెస్ట్ | 0.21 cr |
గుంటూరు | 0.26 cr |
కృష్ణా | 0.27 cr |
నెల్లూరు | 0.15 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.89 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.11 cr |
ఓవర్సీస్ | 0.08 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 3.08 cr |
‘ఎ1 ఎక్స్ ప్రెస్’ చిత్రానికి రూ.4.6 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది.3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 3.08 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బ్రేక్ ఈవెన్ కు ఇంకా 1.92కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రానికి హిట్ టాక్ రావడంతో 2వ రోజు నుండీ స్క్రీన్లు పెంచుతూ వచ్చారు. దాంతో ఆదివారం నాడు మొదటిరోజుని మించి కలెక్ట్ చేసింది ‘ఎ1 ఎక్స్ ప్రెస్’. అయితే వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం బాగా రాబట్టాల్సి ఉంది. ఎందుకంటే మార్చి 11న శర్వానంద్ ‘శ్రీకారం’, నవీన్ పోలిశెట్టి ల ‘జాతి రత్నాలు’, శ్రీవిష్ణుల ‘గాలి సంపత్’ క్రేజీ చిత్రాలు విడుదలవుతున్నాయి.
Click Here To Read Movie Review
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!