కోట్లలో నష్టాలను తెచ్చిన ఆ అమ్మాయి?

ప్రేమ కథ చిత్రం ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సుధీర్ బాబు ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్నాడు. కొంతకాలం క్రితం శ్రీదేవి సోడా కంపెనీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సుధీర్ బాబు ఇటీవల “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మైత్రి మూవీ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 16వ తేదీన విడుదల అయ్యింది.

అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ సినిమాలో సుధీర్ బాబుకి జోడిగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి నటించింది. ఈ సినిమా ప్లాప్ అవటంతో కృతి కెరీర్లో వరుసగా మూడు ప్లాఫులు పడ్డాయి. ఇక సినిమా విషయానికి వస్తే… లవ్ అండ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద ఇంపాక్ట్ చూపించలేకపోయింది.

దాదాపు రూ. 13 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని కొనటానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అడ్వాన్స్ బేసిస్ తో నిర్మాతలు ఈ సినిమాని విడుదల చేశారు. ఈ సినిమా విడుదలైన నాటి నుండి ఇప్పటివరకు రూ. 1 కోటి రూపాయలు వసూలు చేయగా మరొక నాలుగు కోట్లు వసూలు కావలసి ఉంది. అయితే ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు నాలుగు కోట్లు నష్టం వచ్చేలా ఉందిని సమాచారం. దీంతో ఈ సినిమా చివరకు నష్టాలను చవిచూసేలా ఉంది.

ఈ సినిమా ప్లాప్ అవటంతో ఇంద్రగంటి మోహనకృష్ణకి హ్యాట్రిక్ ప్లాప్ పడింది. ఇదివరకు ఈయన దర్శకత్వంలో వచ్చిన బందిపోటు వి సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. ఇక తాజాగా ఇటీవల విడుదలైన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా కూడా ప్లాప్ అయ్యింది. మొత్తానికి ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా నష్టాలను చవిచూసి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది..

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus