Aadhi, Nikki: ఆది పినిశెట్టి కట్నం వార్తల్లో వాస్తవాలివే!

తెలుగులో తక్కువ సినిమాల్లోనే నటించినా ప్రేక్షకుల హృదయాలలో చెరిగిపోని ముద్ర వేసుకున్న నటులలో ఆది పినిశెట్టి ఒకరు. ఒక విచిత్రం అనే సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన ఆది పినిశెట్టి కొన్ని సినిమాలలో సెకండ్ హీరో రోల్స్ లో మరికొన్ని సినిమాలలో విలన్ గా నటించారు. తమిళంలో ఆది పినిశెట్టి ఎక్కువ సినిమాలలో నటించగా తెలుగులో సరైనోడు, నిన్నుకోరి, రంగస్థలం సినిమాలు ఆది పినిశెట్టికి నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి.

తాజాగా ఆది పినిశెట్టి వివాహం గ్రాండ్ గా జరిగిందనే సంగతి తెలిసిందే. హీరోయిన్ నిక్కీ గల్రానీని ఆది వివాహం చేసుకున్నారు. అయితే ఆది పినిశెట్టి భారీ మొత్తంలో కట్నం తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే వైరల్ అయిన కామెంట్ల గురించి ఆది పినిశెట్టి సన్నిహితులు స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఆది పినిశెట్టి కట్నం తీసుకున్నారనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని వాళ్లు తెలిపారు.

నిక్కీ కుటుంబం భారీ మొత్తంలో కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా తనకు రూపాయి కూడా కట్నంగా వద్దని ఆది పినిశెట్టి చెప్పారని సమాచారం అందుతోంది. ఈ కాలంలో కూడా కట్నం తీసుకోని వాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. యాగవరైనమ్‌ నా కక్కా, మరగధ నాణ్యం సినిమాలలో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ కలిసి నటించారు. మరగధ నాణ్యం మూవీ షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని సమాచారం.

పెళ్లి తర్వాత నిక్కీ గల్రానీ నటిగా కెరీర్ ను కొనసాగిస్తారో లేదో తెలియాల్సి ఉంది. ఆది పినిశెట్టి ది వారియర్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఆది పినిశెట్టి తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా తెలుగులో సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీ కలకాలం సంతోషంగా జీవనం సాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

More….

1

2

3

4

5

6

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15


1

2

3

4

5

6

7

8

9

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus