Aadi Saikumar: సినిమాల్లో ఇంకా లేదు.. ఓటీటీలో ఏం చేస్తాడో!

ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ వెళ్లే హీరోలు కొందరు ఉంటారు. అవకాశాలు ఎలా వస్తాయో తెలియదు కానీ, సరైన విజయాలు అయితే రావడం లేదు వారికి. అలాంటి కథానాయకుల్లో సాయికుమార్‌ తనయుడు ఆది ఒకరు. చాలా ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నా… ఇటీవలకాలంలో సరైన విజయం అందుకోలేకపోతున్నాడు ఆది. అయితే ఇప్పుడు తన అదృష్టాన్ని ఓటీటీలో పరీక్షించుకోబోతున్నాడు. అవును ఆది ఓటీటీ ఎంట్రీకి అంతా సెట్‌ అవుతోందట. టాలీవుడ్‌లో ఇప్పటికే కొంతమంది హీరోలు ఓటీటీలో అడుగుపెట్టారు.

నాగచైతన్య ‘దూత’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాడు. తాజాగా షూటింగ్ కూడా పూర్తయింది. రానా – వెంకటేశ్‌ కలసి ‘రానా నాయుడు’ అనే వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారు. త్వరలోనే ఇది స్ట్రీమింగ్‌కి వస్తుందని టాక్‌. వీళ్లు కాకుండా చాలామంది చిన్న హీరోలు, నటులు ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. అలా ఆది కూడా ఓ ఓటీటీ స్క్రిప్ట్‌ రెడీ చేసుకున్నారట. ఆల్‌మోస్ట్‌ అంతా రెడీగా ఉందని త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ అని టాక్‌. ఓటీటీ ఎంట్రీ కోసం చాన్నాళ్లుగా ఆది సాయికుమార్‌ ఎదురుచూస్తున్నాడట.

ఇటీవల ఓ స్టోరీ విని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట. ఆ ప్రాజెక్టు దాదాపు ఓకే అయిపోయిందని, చిన్నపాటి మార్పులు అవసరమని, వాటిని పూర్తి చేసి త్వరలో గ్రాండ్‌గా ఓటీటీ డెబ్యూ గురించి అనౌన్స్‌మెంట్ ఇవ్వాలని చూస్తున్నారట. అయితే ఎలాంటి వెబ్‌ సిరీస్‌, ఎందులో స్ట్రీమ్‌ అవుతుంది అనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఇక ఆది సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం అతని చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి.

‘జంగిల్‌’, ‘కిరాతక’, ‘సీఎస్‌ఐ సంతాన్‌’, ‘అమ్రాన్‌ ఇన్‌ ది సిటీ: ఛాప్టర్‌ 1’, ‘బ్లాక్‌’ సినిమాలు ఉన్నాయి. ఇందులో ‘జంగిల్‌’ తెలుగు, తమిళంలో రూపొందుతోంది. ప్రస్తుతం ఇవన్నీ చిత్రీకరణ, పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలోనే ఉన్నాయి. త్వరలో వీటి రిలీజ్‌ డేట్లు ప్రకటిస్తారు. ఈ క్రమంలోనే ఓటీటీ సంగతి కూడా బయటికొచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సాయికుమార్‌ ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus