ఆమిర్‌ సినిమాపై సోదరుడు ఏమన్నారంటే?

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమా పరాజయానికి కారణాలు అని లిస్ట్‌ రాసుకోవడం మొదలుపెడితే చాలానే వస్తాయి. సినిమా కథ, సమయం, నేపథ్యం.. ఇలా పెద్ద లిస్టే వస్తుంది. దీంతోపాటు ఆమిర్‌ ఖాన్‌ గతంలో చేసిన వ్యాఖ్యల ప్రభావం కూడా ఈ లిస్ట్‌లోనే ఉంటుంది. దీని గురించి చాలాసార్లు చాలామంది మాట్లాడారు. తాజాగా దీనిపై ఆమిర్ ఖాన్‌ సోదరుడు ఫైసల్‌ ఖాన్‌ కూడా స్పందించాడు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

సుదీర్ఘ విరామం తర్వాత భారీ అంచనాలతో లాల్‌ సింగ్‌ చడ్డా విడుదలైంది. తెలుగులో ప్రముఖ నటుడు చిరంజీవి సమర్పణలో సినిమాను రిలీజ్‌ చేశారు. దీంతో అంచనాలు ఇంకా పెరిగాయి. అయితే అంత భారీ హంగామాతో వచ్చిన సినిమా… బాక్సాఫీస్‌ వద్ద నిరాశను మిగిల్చింది. ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించడంతో ఆమిర్ ఖాన్‌కు కూడా నష్టాల సెగ తగిలింది. అయితే ఈ సినిమా దారుణ పరాజయానికి నెగెటివ్‌ పబ్లిసిటీ, ఫేక్‌ రివ్యూలే కారణమని ఆమిర్‌ ఖాన్‌ అన్నాడు.

బాయ్‌కాట్‌ ట్రెండ్‌ ప్రభావం ‘లాల్ సింగ్‌ చడ్డా’ సినిమాపై తీవ్రంగా చూపిందని ఆమిర్‌ ఖాన్‌ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఫైసల్‌ ఖాన్‌ మాట్లాడుతూ ‘‘లాల్‌ సింగ్‌ చడ్డా’ అంత అద్భుతమైన సినిమా ఏమీ కాదు. ప్రేక్షకుల్లో సినిమా మీద వ్యతిరేకత లేకున్నా మంచి కలెక్షన్లు వచ్చేవి కావు. సినిమా విడుదలయ్యాక నిరసనకారులను క్షమాపణలు అడిగిన ఆమిర్‌, విడుదలకు ముందే ఆ పని చేయాల్సింది’’ అని అన్నారు.

సినిమా కోసం క్షమాపణలు అడగడం సమంజసం కాదు. ఆ పని ముందుగతానే చేయాలి అనేది ఫైసల్‌ మాట. అలా అని తనకు ఆమిర్‌తో ఇప్పుడు ఎలాంటి గొడవలు లేవని, ఇద్దరం సఖ్యతతోనే ఉంటున్నామని ఫైసల్‌ వెల్లడించాడు. సాక్ష్యాత్తు ఆమిర్ ఖాన్‌ సోదరుడే ఈ మాటలు అనేసరికి ఆమిర్ ఏమన్నా తప్పు చేశాడా అనే ఫీలింగ్‌ కొంతమందిలో కలుగుతోంది. అయితే ఫైసల్‌ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి అని ఇంకొందరు అంటున్నారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus