Aamir Khan: ఆ రోజు మేం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది: ఆమిర్‌ ఖాన్‌

ఆమిర్‌ ఖాన్‌ అంటే.. మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ అనే పేరు. సినిమాల విషయంలో ఆయన చూపించినంత పర్‌ఫెక్షనిజం ఇంకెవరూ చూపించలేరు మెగాస్టార్‌ చిరంజీవి లాంటివాళ్లే అన్నారు. అంత పక్కాగా ఉంటాడు కాబట్టే.. అలాంటి సినిమాలు చేశాడు. వరుస విజయాలతో, భారీ వసూళ్లతో కోట్లు సంపాదించాడు. అయితే ఒకానొక దశలో ఆమిర్ ఖాన్‌ కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చిందంటే నమ్ముతారా? చాలామంది నమ్మలేని ఈ నిజాన్ని ఆమిర్‌ ఇటీవల చెప్పుకొచ్చాడు. దీంతో ఆమిర్‌ పరిస్థితి ఇదా అంటూ అభిమానులు బాధపడుతున్నారు.

ఇటీవల ‘లాల్‌సింగ్‌ చడ్డా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమిర్‌.. దారుణ పరాజయం అందుకున్నాడు. మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ నుండి ఇలాంటి సినిమానా అంటూ అభిమానులు సైతం బాధపడ్డారు. దీంతో ఆమిర్‌ తన సినిమాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఏడాదిన్నర వరకు మళ్లీ ముఖానికి రంగేసుకునేది లేదు అని ఫిక్స్‌ అయ్యారు. అయితే ఈ మధ్యే కూతురు ఇరా ఖాన్‌ నిశ్చితార్థ వేడుకలో ఉత్సాహంగా కనిపించారు. ఈ క్రమంలో ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఈ క్రమంలో తన చిన్నతనంలో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల్ని తలచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు ఆమిర్‌. ‘‘నా చిన్నతనంలోని రోజులు నాకింకా గుర్తున్నాయి. నాన్న తాహిర్‌ హుస్సేన్‌ ‘లాకెట్‌’ అనే సినిమాని నిర్మిస్తున్న సమయమం అది.. అందులో జితేంద్ర, రేఖ, ఖాదర్‌ ఖాన్‌ లాంటి అగ్ర తారలు నటిస్తున్నాయి. అప్పట్లో వాళ్లు ఏడాదిలో 30 సినిమాలకుపైగా నటించేవారు. మా నాన్న పెద్ద నిర్మాత కాకపోవడంతో సరిగా డేట్లు కుదిరేవి కావు’’ అంటూ నాటి పరిస్థితులు చెప్పారు.

‘‘డేట్స్‌ సెట్‌ కాకపోవడంతో షూటింగ్‌ వాయిదాలు పడుతుండేది. దీంతో సినిమా పూర్తవడానికి దాదాపు ఎనిమిదేళ్లు పట్టేసింది. ఆ సమయంలో మా కుటుంబం దాదాపు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది. డబ్బులు ఎప్పుడిస్తారంటూ అప్పులోళ్లు నిలదీసేవాళ్లు. సినిమా పూర్తియితే చేతికి డబ్బులు వస్తాయి అని నాన్న వాళ్లను బతిలాడేవారు. అప్పుడు నాకు పదేళ్లు. అదంతా చూసి ఏమీ చేయలేక బాధపడేవాణ్ని’’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆమిర్‌.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus