మోడీ నోట్ల బ్యాన్ ఎఫెక్ట్ సినిమాలపై చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే ఆ దెబ్బ నుంచి కోలుకొంటున్న టాలీవుడ్ కు ఇప్పుడు బాలీవుడ్ నుంచి గట్టి పోటీ ఎదురవ్వనుంది. బాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు వరుసబెట్టి విడుదలకు సిద్ధమవ్వనుండడమే ఇందుకు కారణం. అమీర్ ఖాన్ “దంగల్” ఈవారం విడుదలవుతుండగా.. జనవరిలో షారుక్ ఖాన్ “రాయీస్” చిత్రాలు రిలీజ్ కానున్నాయి. మామూలుగానే సౌత్ లో అమీర్, షారుక్, సల్మాన్ లను విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అలాంటిది వారి సినిమాలు వరుసబెట్టి విడుదలవుతుండడంతో.. మన తెలుగు సినిమాల కలెక్షన్స్ పై వారి చిత్రాల విడుదలలు గట్టి ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.
అమీర్ ఖాన్ సినిమాలు మామూలుగానే సునాయాసంగా 300 కోట్లు రూపాయలు వసూలు చేసేస్తుంటాయి. అలాంటిది విడుదలకు రెండ్రోజుల ముందే “దంగల్” చిత్రాన్ని రివ్యూ రైటర్లకు స్పెషల్ షో వేసి.. ఒకరోజు ముందే అన్నీ పాజిటివ్ రివ్యూలు వచ్చేలా ప్లాన్ చేసిన అమీర్ ఖాన్ మాస్టర్ ప్లాన్ ఫలించిందంటే.. ఈ సినిమా 500 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం ఉండదు. సో, జనవరి తొలి వారంలో విడుదలయ్యే తెలుగు సినిమాలపై మల్టీప్లెక్స్ థియేటర్ల వరకూ “దంగల్” ఎఫెక్ట్ ఉంటుంది. ఇక జనవరి 25న షారుక్ ఖాన్ “రాయీస్” అంటూ చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ మసాలా ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకురానున్నాడు. షారుక్ తోపాటు హృతిక్ రోషన్ కూడా “కాబిల్” (తెలుగులో “బలం”) అంటూ బాక్సాఫీస్ పై దండెత్తుతున్నాడు. సో, ఇలా బాలీవుడ్ హీరోలందరూ హిందీతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వరుస దాడులు చేస్తుంటే.. మన టాలీవుడ్ సినిమాల పరిస్థితి ఏంటి అని విశ్లేషకులు వాపోతున్నారు!
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.