Aamir Khan: హిందీ నుండి వచ్చి సాయం కోరుతున్నా: ఆమిర్‌ ఖాన్‌

సౌత్‌ సినిమా పరిశ్రమ నుండి పాన్‌ ఇండియా సినిమాలు రాక ముందు వరకు ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ బాలీవుడ్‌ సినిమా మాత్రమే. అందులో నాగచైతన్య ఓ మంచి పాత్ర చేస్తున్నాడంతే. అయితే ఇప్పుడు ‘లాల్ సింగ్‌ చడ్డా’ను బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ భారీగా విడుదల చేస్తున్నారు. దీంతో ఈ సినిమా గురించి తెలుసుకోవాలని చాలామంది అనుకుంటున్నారు. ఈ సినిమా ‘ఫారెస్ట్‌ గంప్‌’ అనే అమెరికన్‌ కామెడీ సినిమాకు రీమేక్‌. 28 ఏళ్ల క్రితం విడుదలై మంచి విజయం అందుకుంది.

ఇప్పుడు ఇన్నాళ్లకు ఈ సినిమాను భారతీయ చిత్ర సీమకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆమిర్‌ ఖాన్‌ సినిమా గురించి, సినిమా గురించి చేసిన మార్పుల గురించి తెలుగు ప్రజలకు వివరించారు. ఆదివారం తెలుగు వెర్షన్‌ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా ఆమిర్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా స్క్రిప్ట్‌ సిద్ధం చేయడానికి సుమారు 10 ఏళ్లు పట్టింది. ‘ఫారెస్ట్‌ గంప్‌’తో పోలిస్తే మార్పులు చేశాం. మన వెర్షన్‌లో కథానాయకుడి పాత్ర స్వచ్ఛంగా, అమాయకంగా ఉంటుంది’’ అని చెప్పాడు ఆమిర్‌.

నా సినిమాలు తెలుగు, తమిళంలో డబ్‌ అవుతూ ఉంటాయి. అయితే ఆ సినిమాలు ఫ్యాన్స్‌ దగ్గరకు పూర్తి స్థాయిలో చేరలేదు. అందుకే ఈ సినిమాని తెలుగులో విడుదల చేసి, మరింత ఎక్కువ మందికి చేరువయ్యేలా చూడమని చిరంజీవిని కోరాను. ఆయన నాపై ప్రేమతో తెలుగులో మా సినిమాను సమర్పించేందుకు ముందుకొచ్చారు అని ఆమిర్‌ వెల్లడించాడు. నా 35 ఏళ్ల కెరీర్‌లో అతిపెద్ద సవాలు ఈ సినిమానే. మానసికంగా, శారీరకంగా సినిమా కోసం శ్రమించాను అని చెప్పాడు ఆమిర్‌.

ఈ సినిమాలో పరిగెత్తే సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. కశ్మీర్‌ నుండి కన్యాకుమారి వరకు దేశం మొత్తం పరిగెత్తాను అని ఆమిర్‌ ఖాన్‌ తెలిపాడు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక ఇందులో కథానాయికగా ఆమిర్‌ సరసన కరీనా కపూర్‌ నటిస్తోంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus