Aamir Khan, Vijay: అక్కడ సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి… ఇప్పుడు ఇలా వస్తున్నాడా?

వరుస పరాజయాలు అందులోనూ దారుణ పరాజయాలు అందుకుంటున్నాడనో లేక ఇంకే కారణమో కానీ బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ఆమిర్‌ ఖాన్‌ కొత్త ఇండస్ట్రీవైపు వస్తున్నాడు. చాలా ఏళ్లుగా బాలీవుడ్‌లో ఉన్న ఆమిర్‌ ఖాన్‌… ఇప్పుడు ఇతర పరిశ్రమల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్‌? ఇతర హీరోలతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానకిఇ ఆమిర్‌ ఫిక్స్‌ అయ్యాడు అని చెబుతున్నారు. ఈ మేరకు సౌత్‌ సినిమాల్లోకి వస్తున్నాడట. ఈ మేరకు దళపతి విజయ్‌తో ఓ సినిమా చేస్తున్నాడు అని ఓ రూమర్‌ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్‌ స్టార్‌ యాక్టర్‌లు ఇప్పుడు దక్షిణాది సినిమాల్లో మెరవడం ఎక్కువ అవుతోంది. రజనీకాంత్‌ ‘జైలర్‌’ సినిమాలో జాకీ ష్రాఫ్‌, విజయ్‌ ‘లియో’ సినిమాలో సంజయ్‌ దత్‌, పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ సినిమాలో ఇమ్రాన్‌ హష్మీ, ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాలో సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు / నటిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌ కూడా తమిళ చిత్రసీమలో అడుగు పెట్టనున్నట్లు సమాచారం. విజయ్‌ తర్వాతి సినిమాలో ఆమిర్‌ నటిస్తున్నాడని ఓ పుకారు మొదలైంది.

ఏజీఎస్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించనున్న విజయ్‌ 68వ చిత్రంలో (Aamir Khan) ఆమిర్‌ ఖాన్‌ ఓ పాత్రధారి ఆని చెబుతున్నారు. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఇప్పటికే ఆమిర్‌ను సంప్రదించారట. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి అని చెబుతున్నారు. అలాగే మోహన్‌ రాజా దర్శకత్వంలో జయం రవి నటించనున్న ‘తని ఒరువన్‌ 2’ సినిమాలోనూ ఆమిర్‌ ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు టాక్‌ వినిపిస్తోంది.

ఏజీఎస్‌ ప్రొడక్షన్స్‌కు చెందిన వ్యక్తులు ఇటీవల ఆమిర్‌ ఖాన్‌ను కలిశారట. ఆ సమావేశం అనంతరం ఆమిర్‌తో కలిసి దిగిన ఫొటోను వాళ్లు సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో ఆమిర్‌ దక్షిణాది రాక ఖాయమనే వార్తలు నిజమవుతాయి అనిపిస్తోంది. ఏ సినిమా చేసినా పాత్ర విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉండే ఆమిర్‌… ఇప్పుడు విలన్‌గా చేసినా అదే స్థాయిలో అవుట్‌పుట్‌ ఇస్తాడు అని చెప్పొచ్చు. మరి ఈ పుకార్లు నిజమవుతాయో లేదో చూడాలి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus