Anandam Collections: ‘ఆనందం’ కి 21 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

‘ఆనందం’ చిత్రం విడుదలై ఈరోజుతో 21 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ‘#21YearsForAnandam’ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 2001 వ సంవత్సరం సెప్టెంబర్ 28న విడుదలైన ‘ఆనందం’ చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ మూవీని ఓ క్లాసిక్ అనొచ్చు. ఈ చిత్రంలోని కామెడీ,పాటలు.. ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉండడం విశేషం. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘ఉషాకిరణ్ మూవీస్’ బ్యానర్ పై రామోజీరావు నిర్మించాడు.

ఈ చిత్రంతో దర్శకుడు శ్రీను వైట్ల బాగా పాపులర్ అయ్యాడు. ఇక ఈ చిత్రం ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 2.46 cr
సీడెడ్ 1.06 cr
ఉత్తరాంధ్ర 1.26 cr
ఈస్ట్ 0.75 cr
వెస్ట్ 0.59 cr
గుంటూరు 0.90 cr
కృష్ణా 0.92 cr
నెల్లూరు 0.48 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.42 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 1.63 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.05 cr

‘ఆనందం’ చిత్రం కేవలం రూ.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ మూవీ ఏకంగా రూ.10.05 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి బయ్యర్లకు రూ.8.05 కోట్ల ప్రాఫిట్ ను అందించింది. ఈ చిత్రం తర్వాత శ్రీను వైట్ల వరుస ఆఫర్లు దక్కించుకుని స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. హీరో ఆకాష్, అలాగే సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కు కూడా ఈ మూవీ తర్వాత మంచి ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus