Aata Sandeep: బిగ్ బాస్ టాప్3 వీళ్లేనంటున్న ఆట సందీప్.. ఏమైందంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 నుంచి ఈ వారం ఆట సందీప్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. నామినేషన్స్ లోకి వచ్చిన తొలి వారమే ఆట సందీప్ ఎలిమినేట్ కావడం గమనార్హం. మరోవైపు టేస్టీ తేజ నామినేట్ చేసిన వాళ్లే ఎలిమినేట్ అవుతున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బిగ్ బాస్ షో సీజన్7 టాప్3 కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఆట సందీప్ కొన్ని పేర్లను ప్రచారంలోకి తెచ్చారు.

సందీప్ మాట్లాడుతూ మనం ఒకరికి మంచి చేస్తే మనకు మంచి జరుగుతుందని నా విషయంలో అది వర్కౌట్ అయిందని అన్నారు. ఇమ్యూనిటీ వల్ల ఐదు వారాల పాటు నామినేషన్స్ లో లేకపోవడం అనేది సర్ప్రైజ్ అని సందీప్ చెప్పుకొచ్చారు. నేను హౌస్ లో ఉన్నది ఉన్నట్లు మాట్లాడానని ఇంట్లో ఎలా ఉంటానో హౌస్ లో అలానే ఉన్నానని అన్నారు. నాతో ఎవరైనా అరుస్తూ మాట్లాడితే నేను కూడా అలానే మాట్లాడానని ఆట సందీప్ కామెంట్లు చేశారు.

నేను సేఫ్ ప్లేయర్ ను కాదని సంచాలక్ గా కూడా బాగానే చేశానని సందీప్ అన్నారు. మనం ఒక గేమ్ ఆడే సమయంలో మనల్ని మనం రక్షించుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని గేమ్స్ విషయంలో నేను అలా వ్యవహరించానని సందీప్ కామెంట్లు చేశారు. పల్లవి ప్రశాంత్, ప్రియాంక, అమర్ దీప్ టాప్3 లో ఉంటారని ఆట సందీప్ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

బిగ్ బాస్ షో విషయంలో (Aata Sandeep) ఆట సందీప్ చెప్పిన విధంగానే జరుగుతుందో లేక మరో విధంగా జరుగుతుందో చూడాల్సి ఉంది. సందీప్ మాట్లాడుతూ ఇప్పటికీ హౌస్ లో నాకంటే తక్కువగా ఆడుతున్న వాళ్లు కూడా ఉన్నారని అన్నారు. రతికా రోజ్, భోలే షావలి బిగ్ బాస్ హౌస్ లో ఆడిందేమీ లేదని ఆయన కామెంట్లు చేశారు. నాకన్నా ముందే భోలే షావలి వెళ్లిపోవచ్చని అనుకున్నానని ఆట సందీప్ పేర్కొన్నారు. ఆయన చెప్పిన విషయాలు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus