Abbas: ఆ కీలక పాత్రలో అబ్బాస్ నటిస్తున్నారా?

సౌత్ ఇండియాలో నటుడిగా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో అబ్బాస్ ఒకరనే సంగతి తెలిసిందే. ప్రేమదేశం సినిమాతో అబ్బాస్ కు మంచి పేరు రాగా చాలా సంవత్సరాల తర్వాత అబ్బాస్ తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నారని తెలుస్తోంది. లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటించనున్నారనే సంగతి తెలిసిందే.

మొదట రాజశేఖర్ ఈ పాత్ర కోసం ఎంపిక కాగా రాజశేఖర్ ఆ పాత్రను వదులుకోవడంతో జగపతిబాబు ఎంపికయ్యారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రకు అబ్బాస్ ఎంపికయ్యాడని తెలుస్తోంది. అయితే అబ్బాస్ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఊహించని స్థాయిలో డిమాండ్ ఉంది. రోజుకు 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల రేంజ్ లో చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

అబ్బాస్ చేతిలో పెద్దగా సినిమా ఆఫర్లు లేవు కాబట్టి ఆయన ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ను డిమాండ్ చేసే అవకాశం కూడా దాదాపుగా ఉండదని చెప్పవచ్చు. సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నటులకు టాలీవుడ్ దర్శకనిర్మాతలు పిలిచి మరీ అవకాశాలను ఇస్తున్నారు. టాలీవుడ్ హీరో గోపీచంద్ కు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు.

పక్కా కమర్షియల్ సినిమాతో భారీ హిట్ ను ఖాతాలో వేసుకుని తర్వాత సినిమాలతో కూడా విజయాలను అందుకోవాలని గోపీచంద్ భావిస్తున్నారు. గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ కాంబోలో తెరకెక్కే తర్వాత సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus