టాలీవుడ్ హీరోలలో ఒకరైన దగ్గుబాటి అభిరామ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన అహింస సినిమాతో అభిరామ్ సినీ కెరీర్ మొదలైంది. అహింస సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా దగ్గుబాటి అభిరామ్ కు ఆఫర్లు మాత్రం ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. పలు వివాదాల ద్వారా కూడా అభిరామ్ గతంలో వార్తల్లో నిలిచారు. అయితే దగ్గుబాటి అభిరామ్ ను కుటుంబ సభ్యులు దూరం పెట్టారంటూ ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం గురించి సైతం అభిరామ్ స్పందించి క్లారిటీ ఇచ్చారు.
అభిరామ్ తాజాగా రైటర్స్ కేఫ్ పేరుతో కేఫ్ ను మొదలుపెట్టగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకునే యువ రైటర్స్ ను ప్రోత్సహించడానికి ఈ కేఫ్ ను పెట్టినట్టు అభిరామ్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అభిరామ్ తనపై వచ్చిన వివాదాల గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. లైఫ్ అనేది సులువుగా ఉండదని తాతయ్య చనిపోయిన తర్వాత లైఫ్ విలువ తెలిసిందని ఇకపై బాధ్యతగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని అభిరామ్ కామెంట్లు చేశారు.
నా కాళ్లపై నేను నిలబడాలని అనుకున్నానని అభిరామ్ చెప్పుకొచ్చారు. నాపై వివాదాలు వచ్చిన సమయంలో కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయని అభిరామ్ కామెంట్లు చేశారు. అహింస తర్వాత నాకు కొన్ని మూవీ ఆఫర్లు వచ్చాయని అభిరామ్ చెప్పుకొచ్చారు. అయితే నటుడిగా నేనింకా ఎంతో నేర్చుకోవాలని అర్థమైందని అభిరామ్ తెలిపారు. అందుకే కొంచెం సమయం కావాలని దర్శకనిర్మాతలకు చెప్పానని అభిరామ్ అన్నారు.
లవ్ స్టోరీలలో యాక్ట్ చేయాలని ఉందని అభిరామ్ వెల్లడించారు. అభిరామ్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో దగ్గుబాటి అభిరామ్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. (Abhiram) అభిరామ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు