Abhiram: అహింస తర్వాత అభిరామ్ పరిస్థితి ఇదే.. ఇన్ని ఆఫర్లు వస్తున్నాయా?

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి అహింస సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అభిరామ్ కు ఈ సినిమా ఫలితం షాకిచ్చింది. ఒకింత భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాలో కథ, కథనం ఏ మాత్రం ఆసక్తికరంగా లేవు. తేజ కెరీర్ తొలినాళ్లలో ఎంచుకున్న తరహా కథాంశంతోనే ఈ సినిమాను తెరకెక్కించడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఈ సినిమాలో అభిరామ్ నటన గురించి సైతం నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.

అయితే అహింస మూవీ ఫ్లాపైనా అభిరామ్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. ప్రేక్షకుల్లో గుర్తింపు ఉన్న హీరో కావడంతో అభిరామ్ తో సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు ముందుకొస్తున్నారు. అభిరామ్ తో సినిమాలను నిర్మిస్తే డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా భారీ స్థాయిలో ఆదాయం వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం అందుతోంది. అభిరామ్ కు బ్యాగ్రౌండ్ ఉండటం కూడా ప్లస్ అవుతోంది.

అభిరామ్ మాత్రం రెండో సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే కథను ఎంచుకోవాలని అభిరామ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అభిరామ్ కెరీర్ పరంగా సక్సెస్ సాధించాలని దగ్గుబాటి ఫ్యాన్స్ కోరుకుంటున్నారని బోగట్టా. అభిరామ్ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

అభిరామ్ కు దగ్గుబాటి అభిమానుల సపోర్ట్ భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. అభిరామ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు క్రేజ్ ఉన్న డైరెక్టర్ల డైరెక్షన్ లో తెరకెక్కితే ఈ హీరో కెరీర్ పుంజుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్స్ ప్రెషన్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అభిరామ్ కు కెరీర్ పరంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అభిరామ్ కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus