Aishwarya Rai: అభిషేక్ ను హర్ట్ చేసేలా నెటిజన్ కామెంట్.. ఆయన స్పందన ఇదే!

అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోని బెస్ట్ కపుల్స్ లో ఒకటనే సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్ కెరీర్ పరంగా సక్సెస్ అయిన స్థాయిలో అభిషేక్ బచ్చన్ సక్సెస్ కాలేదు. తనపై సోషల్ మీడియాలో ఏవైనా ట్రోల్స్ వస్తే అభిషేక్ బచ్చన్ తనదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారనే సంగతి తెలిసిందే. ఐశ్వర్యా రాయ్ కీలక పాత్రలో నటించిన పొన్నియిన్ సెల్వన్2 మూవీ పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఐశ్వర్యారాయ్ వయస్సు పెరుగుతున్నా అందంగానే కనిపిస్తున్నారు.

ఈ జనరేషన్ లో కూడా ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. పొన్నియిన్ సెల్వన్2 సక్సెస్ సాధించడంతో అభిషేక్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా పొన్నియిన్ సెల్వన్2 సినిమాలో ఐశ్వర్యారాయ్ తన నటనతో ఎక్స్ ప్రెషన్స్ తో అదరగొట్టిందని చెప్పుకొచ్చారు. పొన్నియిన్ సెల్వన్2 మూవీ అద్భుతంగా ఉందని అభిషేక్ బచ్చన్ రివ్యూ ఇచ్చారు. ఐశ్వర్యా రాయ్ ను చూసి గర్వపడుతున్నానని ఆయన తెలిపారు.

సినిమా యూనిట్ కృషి నాకు కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందని అభిషేక్ బచ్చన్ పేర్కొన్నారు. ఆ కామెంట్ల గురించి ఒక నెటిజన్ స్పందిస్తూ “ఇప్పటికైనా తెలిసిందిగా..! నువ్వు ఆరాధ్యను చూసుకో.. తనను మరికొన్ని సినిమాలు చేయనివ్వు” అని కామెంట్ చేయగా ఈ కామెంట్ గురించి అభిషేక్ స్పందించారు. అభిషేక్ తన పోస్ట్ లో “నేనేమైనా వద్దన్నానా.. తను ఏది చేయాలని అనుకున్నా నా అనుమతి అవసరం లేదు..

అందులోనూ తనకు నచ్చిన పనులు చేయాలనుకుంటే నేను ఎందుకు వద్దంటాను” అని ప్రశ్నించారు. అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యారాయ్ కాంబినేషన్ లో పలు సినిమాలు తెరకెక్కాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. (Aishwarya Rai) ఐశ్వర్య అభిషేక్ కలిసి నటించాలని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus