బిగ్ బాస్ హౌస్ లో ఉండటం అనేది మాములు విషయం కాదు. వివిధ ప్రాంతాలనుంచి, వివిధ ఆలోచనలతో ఉన్న పార్టిసిపెంట్స్ మద్యలో ఉండటం, ఆడటం, గెలవడం, ఓడటం. ఇలా హౌస్ మేట్స్ మద్యలో ఉంటూనే వారి భావాలకి గౌరవం ఇస్తూ వేరే వాళ్లు హర్ట్ అవ్వకుండా, మన ఈగో ఫీలింగ్స్ అనేవి వారిపైన చూపించకుండా గేమ్ ఆడటం అనేది సమాన్యమైన విషయం కాదు. అందుకే హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఒక్కో పార్టిసిపెంట్ ఒక్కో తరహాలో ప్రవర్తిస్తారు. ఒక్కొక్కరు ఒక్కోలా గేమ్ ఆడతారు. హౌస్ లో ఎన్నో విషయాలని వాళ్లు నేర్చుకుంటారు. వారిని వారు మార్చుకుంటారు. ఇందులో భాగంగానే మీరు ఏం నేర్చుకున్నారు..? ఎలా మిమ్మల్ని మీరు మార్చుకున్నారో చెప్పమని చెప్పాడు బిగ్ బాస్.
సోహైల్ , అరియానా, అవినాష్, లాస్య అందరూ తమ మనసులో మాటల్ని పంచుకున్నారు. ఇక్కడే అభిజిత్ కూడా మాట్లాడాడు. లాస్య మెంటాలిటీ వేరు, నాది వేరు కానీ నేను చాలా నేర్చుకున్నానని చెప్పాడు. అలాగే మోనాల్ చాలా ఎక్స్ ప్రెసివ్ అని , నేను అస్సలు కాదు అంటూ చెప్పాడు అభిజిత్. ఇంకా ఎదుటివాళ్ల భావాలకి మనం రెస్పక్ట్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాకే నేను నేర్చుకున్నానని అన్నాడు. ఒక్కోవ్యక్తికి ఇంకో వ్యక్తి ఎంత డిఫరెంట్ అనేది నేను నేర్చుకున్నానని అన్నాడు. ఒక్కో ఫ్యామిలీ కుటుంబం అనేది చాలా భిన్నమైనది, వాళ్ల స్టోరీస్ కూడా చాలా ప్రత్యేకమైనవి ఎంతో డిఫెరెంట్ అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ నేను బిగ్ బాస్ హౌస్ కి రాకపోతే ఇవి నాకు తెలిసేవి కాదని అన్నాడు అభిజిత్. హౌస్ లోకి వచ్చి నేను నేర్చుకున్నది ఇదే అంటూ అన్నాడు.
Most Recommended Video
మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా రివ్యూ & రేటింగ్!
అనగనగా ఓ అతిధి సినిమా రివ్యూ & రేటింగ్!
రెండు చేతులా సంపాదిస్తున్న 13 హీరోయిన్లు..వీళ్లది మామూలు తెలివి కాదు..!