మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న భారీ అంచనాల నడుమ విడుదలై ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రాంచరణ్ సహా నిర్మాతగా వ్యవహరించడంతో పాటు… సిద్ధ అనే పాత్రని కూడా పోషించడం జరిగింది. అతనికి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
దర్శకుడు కొరటాల శివ వల్ల ఈ చిత్రంపై మొదటి నుండీ అంచనాలు భారీగా నమోదవడంతో థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. కానీ ఆ బిజినెస్ కు తగ్గ కలెక్షన్లు అయితే బాక్సాఫీస్ వద్ద నమోదు కావడం లేదు. మొదటి వారంలో.. మొదటి రోజు తప్ప తర్వాత ఏ రోజు కూడా ఈ మూవీ డీసెంట్ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఒకసారి ‘ఆచార్య’ క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 10.88 cr |
సీడెడ్ | 6.02 cr |
ఉత్తరాంధ్ర | 4.67 cr |
ఈస్ట్ | 3.29 cr |
వెస్ట్ | 3.40 cr |
గుంటూరు | 4.17 cr |
కృష్ణా | 3.01 cr |
నెల్లూరు | 2.75 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 38.19 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.88 cr |
ఓవర్సీస్ | 5.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 46.07 cr |
‘ఆచార్య’ చిత్రానికి రూ.133.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.134 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.46.07 కోట్ల షేర్ ను రాబట్టింది. టోటల్ గా ఈ చిత్రం బయ్యర్స్ రూ.87.13 కోట్లు నష్టపోయారు. టాలీవుడ్లో భారీ డిజాస్టర్స్ లో ఒకటిగా ఈ మూవీ మిగిలింది. అలాగే ప్లాప్ అంటే తెలియని దర్శకుడు కొరటాల శివకి డిజాస్టర్ ను పరిచయం చేసింది.
Most Recommended Video
మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!