మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. మాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రాంచరణ్ సహా నిర్మాతగా వ్యవహరించడంతో పాటు… సిద్ధ అనే పాత్రని కూడా పోషించడం జరిగింది. అతనికి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుండీ భారీగా నమోదవ్వడంతో భారీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
కానీ మొదటి రోజే ఈ చిత్రానికి డిజాస్టర్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ అంతంత మాత్రమే నమోదయ్యాయి. ఒకసారి వాటి కలెక్షన్లు గమనిస్తే :
నైజాం | 6.90 cr |
సీడెడ్ | 4.60 cr |
ఉత్తరాంధ్ర | 3.00 cr |
ఈస్ట్ | 2.25 cr |
వెస్ట్ | 2.88 cr |
గుంటూరు | 3.70 cr |
కృష్ణా | 1.40 cr |
నెల్లూరు | 1.60 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 26.33 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 1.60 cr |
ఓవర్సీస్ | 4.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 31.93 cr |
ఆచార్య చిత్రానికి రూ.133.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.134 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం రూ.31.93 కోట్ల షేర్ నమోదైంది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.102.07 కోట్లు షేర్ ను రాబట్టాలి. టార్గెట్ అయితే చిన్నది కాదు. చిరు, కొరటాల ఇమేజ్ లను బట్టి మొదటి రోజు ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించాయి కానీ రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ లో చాలా డ్రాప్ అయ్యాయి.
శని, ఆది వారాలతో పాటు రంజాన్ రోజు హాలిడే కలిసొచ్చి టార్గెట్ రీచ్ అవ్వాలి తప్ప.. ఆ అవకాశాన్ని వదులుకుంటే భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉండనే ఉంది.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!