Chiranjeevi: మరోసారి మెగాఫోన్‌కు పని చెబుతున్న కొరటాల

  • December 20, 2021 / 02:25 PM IST

సినిమాలకు రీషూట్‌ సాధారణం. ఎందుకంటే సినిమాలో కొన్ని సన్నివేశాలు సెట్‌ అవ్వవు అనుకుంటే, ఈ సీన్‌ ఇంకా బాగా తీయొచ్చు అనుకుంటే ఆ సీన్లు మళ్లీ తీస్తుంటారు. దీనినే రీషూట్‌ అంటారు. అయితే ఒక సినిమాకు ఒకసారి రీషూట్‌ అంటే ఓకే…కానీ రెండు సార్లు రీషూట్స్‌ అంటే ఆలోచించాలి. అలాంటి ఆలోచించాల్సిన పరిస్థితి స్టార్‌ హీరోలు – స్టార్‌ దర్శకుడు తీస్తున్న సినిమా అయితే… ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇప్పటికే అర్థమైపోయుంటుంది ఆ సినిమా ఏంటి అనేది. అవును మీరు ఊహించింది నిజమే ‘ఆచార్య’ గురించే ఇదంతా.

ఈ సినిమాకు మరోసారి షూటింగ్‌ జరుగుతుందని సమాచారం. నిజానికి ‘ఆచార్య’ సినిమా షూటింగ్‌ చాలా రోజుల క్రితం పూర్తయిపోయింది. ఫస్ట్‌ కాపీ కూడా సిద్ధమయ్యేంత పని అయిపోయింది. ఫిబ్రవరి 4న సినిమాను విడుదల చేయాలని ప్రకటన చేశారు కూడా. అయితే ఇప్పుడు రీషూట్‌ చేయాలని చూస్తున్నారని సమాచారం. సినిమా షూటింగ్‌కి ఇంకా చాలా సమయం ఉండటం, కొన్ని సీన్లు మారిస్తే బాగుంటుందని కొరటాల శివ అనుకుంటున్నారని టాక్‌. సినిమా విడుదలయ్యే లోపు రిపేర్లు చేద్దామని అనుకుంటున్నారట.

సినిమాలో చిరంజీవి పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల్ని రీ షూట్ చేయాల‌ని కొర‌టాల ప్రయత్నాలు చేస్తున్నారట. ఐదు రోజుల పాటు ఈ రీషూట్ ప్లాన్ చేశారని టాక్‌. అంటే సింగిల్‌ షెడ్యూల్‌ అనుకోవచ్చు. అందులో భాగంగా సీన్స్‌ రీషూట్‌ చేసి, సినిమాలో మార్పులు చేయొచ్చని అనుకుంటున్నారట. ఇందులో ఓ ఫైట్ కూడా ఉంద‌ని తెలుస్తోంది. అయితే ఆ ఫైట్‌ కొత్తదా, పాత ఫైట్‌నే మళ్లీ కొత్తగా తీస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.

‘ఆచార్య’ సినిమాలో ఎలివేషన్లు ఎలా ఉంటాయో… ‘సిద్ధ’ పాత్ర గురించి తెలియజేసే వీడియోలో మనం చూశాం. ఒక సెలయేరులో పులి పిల్ల నీళ్లు తాగుతుంటే… వెనుక పెద్ద పులి కాపు కాసినట్లు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆ షాట్‌ను అలా ప్యాన్‌ చేస్తే… సెలయేరుకి మరోవైపు రామ్‌చరణ్‌ నీళ్లు తాగుతుంటే.. ఆ వెనుక చిరంజీవి అటు ఇటు నడుస్తూ ఉంటాడు. ఆ సీన్‌ చూసిన ప్రేక్షకులు, మెగా అభిమానులు కళ్లను నమ్మలేకపోయారు. ఇప్పుడు రీషూట్‌లో ఇలాంటి మరిన్ని ఎలివేషన్ సీన్లు ఉంటాయని అంటున్నారు. చూడాలి కొరటాల అండ్‌ టీమ్‌ ఏం చేస్తుందో.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus