Chiranjeevi: ‘ఆచార్య’ పాన్ ఇండియా రిలీజ్ లేనట్లే!

  • April 4, 2022 / 10:58 AM IST

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇటీవల విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఉగాది పండగ కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది. హిందీలో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించడమే కాకుండా.. ఇప్పటికీ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తెలుగు రానున్న మరో పెద్ద సినిమా ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీకి, రామ్ చరణ్ కలిసి ఈ సినిమాలో నటించారు.

Click Here To Watch NOW

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తారనుకున్నారు. ఎందుకంటే.. చిరంజీవి అందరికీ తెలిసిన నటుడే. ‘ఆర్ఆర్ఆర్’తో రామ్ చరణ్ పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. అల్లూరి పాత్రని నార్త్ లో కొందరు రాముడిగా ఊహించుకొని చరణ్ కి కనెక్ట్ అయ్యారు. దీంతో కచ్చితంగా ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేస్తారని అనుకున్నారు. కానీ ‘ఆచార్య’ నిర్మాతల్లో ఒకరైన అవినాష్ రెడ్డి మాత్రం ఈ సినిమాను తెలుగులో మాత్రమే విడుదల చేస్తామని వెల్లడించారు.

తమ దృష్టి పాన్ ఇండియాపై లేదని.. తెలుగులోనే భారీ విడుదలకు ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రెండు వేల స్క్రీన్లలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు. చిరంజీవి-రామ్ చరణ్ ఇదివరకు ఒకట్రెండు సీన్స్ లో మాత్రమే కలిసి నటించారు. కానీ ‘ఆచార్య’లో ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తున్నారు.

దీంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus