ఒకప్పుడు టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల మధ్య బాక్సాఫీస్ వార్ నడిచేది. చిరు-బాలయ్య సినిమాలు పోటీకి దిగాయంటే ఫ్యాన్స్ లో వచ్చే మజానే వేరు. ఇద్దరి మధ్య పోరు అలా సాగేది. అలానే చిరు-వెంకీ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద చాలా సార్లు క్లాష్ అయ్యాయి. కలియుగ పాండవులు-చంటబ్బాయ్, రౌడీ అల్లుడు-క్షణక్షణం, ఆపద్బాంధవుడు-సుందరకాండ, మాస్టర్-పెళ్లి చేసుకుందాం రా, అన్నయ్య-కలిసుందాం రా ఇలా వీరిద్దరు నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగాయి.
చివరిగా 2001లో ‘మృగరాజు’-‘దేవీపుత్రుడు’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద తలపడ్డాయి. ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. అయితే ఆ తరువాత వీరిద్దరి మధ్య పోటీని చూసే ఛాన్స్ రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు దాదాపు ఇరవై ఏళ్ల తరువాత ఈ ఇద్దరు హీరోలు పోటీ పడబోతున్నారు. కొరటాల శివ-మెగాస్టార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’ సినిమా, శ్రీకాంత్ అడ్డాల-వెంకీ కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘నారప్ప’ సినిమాలు పోటీ పడుతుండడం విశేషం.
‘ఆచార్య’, ‘నారప్ప’ సినిమా రిలీజ్ డేట్లు కొన్ని గంటల గ్యాప్ లో ప్రకటించారు. ముందుగా ‘నారప్ప’ సినిమాను మే 14న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసిన కాసేపటికే ‘ఆచార్య’ సినిమాను మే 13న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ కాబోతున్న ఈ రెండు సినిమాలలో ఏది నెగ్గుతుందో చూడాలి!
Most Recommended Video
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!