టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలను తెరకెక్కించే దర్శకులలో కొరటాల శివ ఒకరనే సంగతి తెలిసిందే. అయితే కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య షూటింగ్ మాత్రం అంతకంతకూ ఆలస్యమైంది. భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ నటించిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు విడుదల కాగా మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ కూడా దాదాపుగా పూర్తైంది.
అయితే కొరటాల శివ భరత్ అనే నేను మూవీ తర్వాత దర్శకత్వం వహించిన ఆచార్య సినిమా మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ కానుంది. తన ప్రతి సినిమా తప్పనిసరిగా సక్సెస్ సాధించే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు మెసేజ్ ఉండేలా కొరటాల శివ జాగ్రత్తలు తీసుకుంటారు. చిరంజీవి, చరణ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ మూవీగా ఆచార్య తెరకెక్కింది. ఈ సినిమాలో చరణ్ సెకండాఫ్ లో సిద్ధ అనే రోల్ లో కనిపించనున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన లాభనష్టాల బాధ్యత కొరటాల శివదే అని తెలుస్తోంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి రామ్ చరణ్ ఆచార్య సినిమాను నిర్మించారు. అయితే సినిమాలో కొరటాల శివ వాటా కూడా ఉందని బోగట్టా. కొరటాల శివ ఈ సినిమా ప్రొడక్షన్ పనులను చూసుకున్నారు. సినిమాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల బాధ్యతను కొరటాల శివ తనపై వేసుకున్నారని సమాచారం. ఆచార్య సినిమాకు నష్టం వస్తే కొరటాల శివ చేతినుండి ఇస్తారని తెలుస్తోంది.
ఒక విధంగా చెప్పాలంటే కొరటాల శివ ఆచార్య సినిమాతో రిస్క్ చేస్తున్నారనే చెప్పాలి. కొరటాల శివ సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలను మిగల్చలేదు. ఏపీలో టికెట్ రేట్లు పెరిగితే మాత్రం ఆచార్య సినిమా సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆచార్యతో కొరటాల శివ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందేమో చూడాల్సి ఉంది. ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!