మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో నటిస్తున్న ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రీఎంట్రీలో మెగాస్టార్ నటించిన ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలు ఘనవిజయాలను అందుకున్నాయి. అయితే ఆచార్య సినిమా మాత్రం భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ వల్ల చిరంజీవి కథల జడ్జిమెంట్ పై కూడా నెగిటివ్ కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే ఆచార్య ఎఫెక్ట్ చిరంజీవి తర్వాత సినిమాలైన గాడ్ ఫాదర్, భోళా శంకర్ లపై పడిందని సమాచారం అందుతోంది.
ఈ రెండు సినిమాలకు సంబంధించి కొన్ని సన్నివేశాలను రీషూట్ చేస్తున్నారని బోగట్టా. చిరంజీవి ఈ సినిమాల ఔట్ పుట్ విషయంలో నమ్మకస్తుల అభిప్రాయాలను సైతం తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఆచార్య విషయంలో జరిగిన తప్పు తర్వాత సినిమాల విషయంలో జరగకుండా మెగాస్టార్ జాగ్రత్త పడుతున్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు చిరంజీవి కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నాయి. ఈ సినిమాల కలెక్షన్లను బట్టి చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు బిజినెస్ జరగనుంది.
చిరంజీవి రీఎంట్రీలో వేగంగా సినిమాలను చేయాలని భావించారు. అయితే రీమేక్ కథలు చిరంజీవికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాల్సి ఉంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించి ప్రకటనలు వెలువడే ఛాన్స్ అయితే ఉంది. చిరంజీవి ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. తర్వాత సినిమాలతో చిరంజీవికి ఎలాంటి ఫలితాలు దక్కుతాయో చూడాల్సి ఉంది.
చిరంజీవి స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో వరుసగా నటించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆరు పదుల వయస్సులో కూడా ఎంతో ఎనర్జీతో చిరంజీవి వరుసగా సినిమాలలో నటిస్తుండటం గమనార్హం. టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలలో నటిస్తున్న హీరోలలో చిరంజీవి ఒకరు కావడం గమనార్హం.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!