Acharya: ‘ఆచార్య’.. పెండింగ్ లో సీజీ వర్క్..?

  • April 5, 2021 / 07:15 PM IST

లాక్ డౌన్ అనంతరం కొత్త సినిమాలు థియేటర్లో సందడి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ నుండి పెద్ద సినిమాల హడావిడి మొదలుకానుంది. ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మే నెలలో అయితే పెద్ద సినిమాల జాతరే. ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రాబోతున్నాయి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ సినిమాను మే 13న విడుదల చేయనున్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి మరో నలభై రోజుల సమయం ఉంది. షూటింగ్ కాస్త బాకీ ఉంది. అది ఎలాగైనా పూర్తి చేసేస్తారు. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాలని చూస్తున్నారు.

అయితే ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ కొత్త టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. సాధారణంగా కొరటాల సినిమాల్లో సీజీ వర్క్ లకు పెద్దగా స్కోప్ ఉండదు. ఆయన కథలన్నీ ఎమోషనల్ టచ్ తోనే సాగేవే. కాబట్టి సీజీ వర్క్ అవసరం లేకుండా పోయింది. కానీ ‘ఆచార్య’ సినిమాలో సీజీ వర్క్ ఎక్కువ ఉంది. ఈ సినిమా పురాతన దేవాలయాల నేపథ్యంలో సాగే కథ. దీనికోసం స్పెషల్ సెట్స్ వేసినప్పటికీ.. సీజీ వర్క్ మీద కూడా ఎక్కువగా ఆధారపడ్డారని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పనులన్నీ పెండింగ్ లో ఉండిపోయాయని సమాచారం.

సీజీ వర్క్ అంటే చెప్పిన సమయానికి ఎప్పుడూ పూర్తి కాదు. సీజీ వర్క్ చేసే కంపనీలు తమకిచ్చిన డెడ్ లైన్ లో ఎప్పుడూ ప్రాజెక్ట్స్ పూర్తి చేయరు. పెర్ఫెక్షన్ కోసం చాలా సమయం తీసుకుంటారు. ఇప్పుడు కొరటాల సినిమాకి కూడా ఇలానే జరుగుతోంది. పైగా కొరటాలకి సీజీ నిపుణులతో పని చేయడం మొదటిసారి కావడంతో ఆయన బాగా టెన్షన్ పడుతున్నారట. అనుకున్న సమయానికి సీజీ వర్క్ పూర్తవుతుందా లేదా అనే సందేహాలు కలుగుతున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి!

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus