Achyuth: నటుడు అచ్యుత్ ఎలా చనిపోయాడో తెలుసా.?

ఇండస్ట్రీ లో కొన్ని మరణాలు మనల్ని ఎంతో బాధిస్తూ ఉంటాయి. నిన్న మొన్నటి వరకు మన కంటి ముందు తిరిగిన వాళ్ళు అకస్మాత్తుగా ఇక మన మధ్య లేరు అనే వార్త వింటే ఎంత కష్టం గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రముఖ నటుడు అచ్యుత్ మరణం కూడా అలాంటిదే. అచ్యుత్ అంటే నేటి తరం ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు రాకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ సినిమాలో అన్నయ్య గా నటించిన చక్రి అంటే మాత్రం ప్రతీ ఒక్కరు గుర్తు పడుతారు.

సీరియల్స్ లో హీరో గా ఒక రేంజ్ ని ఎంజాయ్ చేసే అచ్యుత్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం అప్పట్లో యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న సమయం లో ఆయనకీ ఇలా జరగడం చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈయన ఈటీవీ లోనే అధికంగా నటిస్తూ ఉండేవాడు. అయితే అచ్యుత్ మరణం పై అప్పట్లో చాలా రూమర్స్ ఉండేవి, ఒక ప్రముఖ టీవీ ఛానల్ యజమాని అచ్యుత్ ని (Achyuth) కావాలని చంపించాడని, అతనిది సహజ మరణం కాదని అప్పట్లో అనేవాళ్ళు.

అయితే దీనిపై ఆయన ప్రాణ స్నేహితుడు ప్రదీప్ చెప్పిన కొన్ని నిజాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘అచ్యుత్ మరణం ని దగ్గరుండి చూసాను, అతను చనిపోయే ముందు రోజు కూడా నేను మాట్లాడాను, షూటింగ్ ఉంది అన్నయ్య వెళ్తున్నాను అన్నాడు , వాడు మాట్లాడేటప్పుడు ఆయాసపడడం నేను గమనించాను. ఏమైందిరా అంత బాగానే ఉందా అంటే, అంతా బాగానే ఉంది అనేవాడు. కానీ వాడి శరీరం లో కొలెస్ట్రాల్ ఉంది, దాని వల్ల పక్క రోజే గుండెపోటు వచ్చింది.

వాడు చనిపోయిన విషయం నుండి నేను ఏడాది వరకు కోలుకోలేకపోయాను. చాలా మంచివాడు, అందరితో కలిసిపోయేవాడు, దేని మీద ఆశ ఉండేది కాదు, కానీ త్రింది మాత్రం బాగా తినేవాడు. అతని భార్య పిల్లలు తో కూడా ఈమధ్యనే మాట్లాడాను, హైదరాబాద్ లోనే చికద్ పల్లి లో ఉంటున్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు జీవితం లో మంచిగా స్థిరపడ్డారు, ఇప్పుడు వాళ్ళ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుంది, ఆ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేవు, ఆర్థికంగా కూడా గొప్ప స్థాయిలో ఉన్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus