Actor Ajay: రెండుసార్లు పెళ్లి చేసుకున్న అజయ్.. కారణమిదే?
- September 6, 2021 / 01:41 PM ISTByFilmy Focus
విలన్ పాత్రల ద్వారా, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల ద్వారా అజయ్ మంచి పేరును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అజయ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. తాను సినిమాల్లోనే కాదని బయట కూడా తప్పులు చేశానని అజయ్ తెలిపారు. టీనేజ్ లో జరిగిన సంఘటనలను అజయ్ గుర్తు చేసుకున్నారు. 19 సంవత్సరాల వయస్సులో ఇంట్లో డబ్బులు తీసుకుని నేపాల్ కు పారిపోయానని అజయ్ అన్నారు.
నేపాల్ లో ఫ్రెండ్ తో కలిసి మూడు నెలలు సరదాగా గడిపానని అజయ్ చెప్పుకొచ్చారు. అయితే తీసుకెళ్లిన డబ్బులు మొత్తం ఖర్చు కావడంతో ఇంటికి రావడానికి కూడా డబ్బులు లేవని అజయ్ వెల్లడించారు. ఆ డబ్బుల కోసం తాను హోటల్ లో పని చేయాల్సి వచ్చిందని అక్కడ గిన్నెలు కడిగి ఆ డబ్బులతో ఇంటికి వచ్చానని అజయ్ తెలిపారు. కాలేజ్ సమయంలో శ్వేతా రావూరిని ప్రేమించి సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నానని అజయ్ వెల్లడించారు.

ఆర్యసమాజ్ లో పెళ్లి జరిగిందని ఆ తర్వాత పెద్దలను ఒప్పించి మరోసారి పెళ్లి చేసుకున్నానని అజయ్ అన్నారు. శ్వేతా రావూరి 2017 సంవత్సరంలో మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో ఫైనల్ కు ఎంపిక కావడంతో పాటు 2018 సంవత్సరంలో అంబాసిడర్ మిస్టర్ అండ్ మిసెస్ సౌత్ ఇండియాగా ఎంపిక కావడం గమనార్హం. ఈ జంటకు ఒక కొడుకు, ఒక కూతురు కాగా అజయ్ భార్య, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!











