Mahesh Babu, Arjun: సర్కారు పాటలో అర్జున్ అలా కనిపిస్తారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్జున్ విలన్ గా నటించనున్నాడని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఈ మధ్య కాలంలో అర్జున్ తెలుగులో నటించిన సినిమాలకు హిట్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. తెలుస్తున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాటలో అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

అర్జున్ మహేష్ బాబు మధ్య గొడవ సినిమాకు హైలెట్ కానుందని సమాచారం. మూవీలో అర్జున్ లంచాలు తీసుకునే పోలీస్ అని మహేష్ కు చుక్కలు చూపిస్తారని తెలుస్తోంది. సినిమాలో మహేష్ ఏ పని చేసినా ఆ పనికి అర్జున్ అడ్డంకులు సృష్టిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర యూనిట్ ఈ వార్తల గురించి ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. పరశురామ్ కమర్షియల్ అంశాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం.

థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. త్వరలో సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ మొదలు కానుందని ఈ షెడ్యూల్ లో మహేష్, అర్జున్ కాంబినేషన్ సన్నివేశాలను తెరకెకించనున్నారని సమాచారం. మహేష్ బాబుకు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అర్జున్ మాత్రమే విలన్ గా నటిస్తున్నారా..? లేక వేరే విలన్ కూడా ఉన్నారా..? తెలియాల్సి ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus