సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. కొన్నాళ్ళ నుండి చూసుకుంటే.. మలయాళ నటుడు విష్ణు ప్రసాద్, డైరెక్టర్ అపర్ణ మల్లాది, నిర్మాత తేనెటీగా రామారావు, మాస్టర్ భరత్ తల్లి కమలహాసిని, ‘అదుర్స్’ విలన్ ముకుల్ దేవ్,తమిళ నటుడు రాజేష్,తమిళ నటుడు విక్రమ్ సుకుమారన్, వైభవ్ కుమార్ సింగ్, షైన్ టామ్ చాకో తండ్రి సీపీ చాకో, సీనియర్ నటి విజయ భాను, అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నం వంటి ఎంతో మంది సెలబ్రిటీలు కన్నుమూశారు. ఈ షాక్..ల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే… హిందీ సినీ పరిశ్రమకు చెందిన నటుడు ఆశిష్ వారంగ్ కన్నుమూశారు.అతని వయసు 55 ఏళ్ళు అని తెలుస్తుంది.
కొన్నాళ్ళుగా జాండీస్ తో బాధపడుతూ వస్తున్న ఆయన ఇటీవల పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఒక దశలో కోలుకున్నట్టు కనిపించినా.. తర్వాత మళ్ళీ పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. మరాఠీ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించిన ఇతను అటు తర్వాత హిందీ టీవీ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.’సూర్యవంశీ’ ‘మర్దానీ’ ‘దృశ్యం’ ‘సింబా’ ‘ఏక్ విలన్ రిటర్న్స్’ ‘సర్కస్’ వంటి సినిమాల్లో నటించారు. అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ తో ఇతను పనిచేశారు. ఆశిష్ నటించిన చివరి చిత్రం ‘బాంబే’ రిలీజ్ కావాల్సి ఉంది.సంజయ్ నిరంజన్ దానికి దర్శకత్వం వహించారు.