Baladitya: రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన మరో నటుడు.. టంగ్ స్లిప్!

ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలో ఉహించని సంఘటన చోటుచేసుకుంది. హైదరాబాదులోని హెచ్ఐసీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే వేదికపై అతిథులను ఆహ్వానించే సమయంలో హోస్ట్‌గా ఉన్న సినీ నటుడు బాలాదిత్య (Baladitya) ఒక పెద్ద పొరపాటు చేశారు. రేవంత్ రెడ్డి అని అనాల్సిన చోట “తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్” అని అనడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. ఈ సంఘటన జరిగిన వెంటనే సభలో నవ్వులు వినిపించాయి.

Baladitya

అయితే బాలాదిత్య తన పొరపాటును వెంటనే గుర్తించి క్షమాపణలు చెప్పి, సీఎం రేవంత్ రెడ్డిని సరిగ్గా ఆహ్వానించారు. ఈ టంగ్ స్లిప్ విషయానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ ఘటనపై విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సరదాగా ట్రోల్ చేస్తుండగా, మరికొందరు ఇది పెద్ద తప్పు కాదని అంటున్నారు. ఈ ఘటనపై పలు కామెంట్లు ఆసక్తికరంగా మారాయి.

“ఇంకో యాంకర్ జైలుకి వెళ్ళబోతున్నాడు” అంటూ నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సంఘటన రేవంత్ రెడ్డిపై పుష్ప 2 (Pushpa 2) ఈవెంట్ సమయంలో వచ్చిన వివాదాన్ని గుర్తుచేసిందని కొందరు చెబుతున్నారు. అప్పట్లో అల్లు అర్జున్ (Allu Arjun) కూడా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించకపోవడం వివాదానికి దారితీసింది. ఇక బాలాదిత్య టంగ్ స్లిప్ వల్ల వెలుగు చూసిన ఈ ఘటనపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి.

“బ్రో, ముందు జాగ్రత్తగా మాట్లాడు” అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు. తెలంగాణలో రాజకీయ కార్యక్రమాల్లో వేదికపైనే ఇలా పొరపాట్లు జరగడం సర్వసాధారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయినప్పటికీ, బాలాదిత్య ఉద్దేశపూర్వకంగా ఈ పొరపాటు చేయలేదని అతని అభిమానులు చెబుతున్నారు.

సంక్రాంతి సినిమాల రేట్లు పెంపు.. ఏపీ ప్రభుత్వం జీవోలు జారీ.. ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus