Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » Brahmaji: ఇంటర్వ్యూ : ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్స్ లో తన సినీ కెరీర్ గురించి బ్రహ్మాజీ చెప్పిన ఆసక్తికర విషయాలు

Brahmaji: ఇంటర్వ్యూ : ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్స్ లో తన సినీ కెరీర్ గురించి బ్రహ్మాజీ చెప్పిన ఆసక్తికర విషయాలు

  • July 28, 2023 / 11:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmaji: ఇంటర్వ్యూ : ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్స్ లో తన సినీ కెరీర్ గురించి బ్రహ్మాజీ  చెప్పిన ఆసక్తికర విషయాలు

సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టాడు సంజయ్ రావు. ‘ఓ పిట్ట కథ’ తో అతను ఓ ఓటీటీ హిట్ అందుకున్నాడు. త్వరలో ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని బ్రహ్మాజీ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ఆ విశేషాలు మీ కోసం :

ప్ర) మీ 37 ఏళ్ళ సినీ జర్నీలో చేయని పాత్ర అంటూ లేదు. ఈ సినిమాలోని మీ పాత్రలో ఏమి నచ్చి యాక్సెప్ట్ చేశారు?

బ్రహ్మాజీ : నిజమే.. నాకు కొత్త పాత్రలు ఏమీ రావు. ఎందుకంటే చాలా రకాల పాత్రలు నేను చేసేశాను. కానీ ఇందులో మాత్రం నిజంగానే నా పాత్ర కొత్తగా ఉంటుంది. ఈ సినిమాలో నేను ఓల్డ్ సిటీలో ఉండే ఓ లాయర్ గా కనిపిస్తాను. ఉర్దూ, తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతూ ఉంటాను. విడాకులిప్పించే స్పెషలిస్ట్ లాయర్ గా నేను కనిపించబోతున్నాను.

ప్ర) ఈ సినిమాలో మీకు ఆఫర్ ఎలా వచ్చింది?

బ్రహ్మాజీ : ఇదే బ్యానర్ లో నేను ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా చేస్తున్న టైంలో నిర్మాత అప్పి రెడ్డి గారు నాకు ఈ కథ, కాన్సెప్ట్ గురించి చెప్పారు. ‘ఓ కొత్త దర్శకుడు కథ చెప్పాడు విని, సలహా చెప్పండి’ అని అన్నారు. కాన్సెప్ట్ బాగా అనిపించింది. బాగుందని చెప్పాను.ముందుగా ఈ పాత్ర కోసం మొదట ఎవరెవరినో అనుకున్నారు. తర్వాత నన్ను అడిగారు.అదే టైంలో హీరో ఎవరు అని అడిగితే.. ఇంకా డిసైడ్ కాలేదు అన్నారు.ఆ తర్వాత మీ అబ్బాయి చేస్తాడేమో అడగండి అన్నారు. సంజయ్‌కి స్టోరీ చెప్పాను.. నచ్చింది అన్నాడు. అలా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం.

ప్ర) మీ అబ్బాయి కూడా డాగ్ లవర్ అంట కదా?

బ్రహ్మాజీ : అవును.. సంజయ్ కూడా డాగ్ లవర్! అందుకే వెంటనే కనెక్ట్ అయ్యి ఈ కథకి ఓకే చెప్పాడు.

ప్ర) ఈ కాన్సెప్ట్ తో సినిమా అనగానే రిస్క్ అనిపించలేదా?

బ్రహ్మాజీ : కొత్త కాన్సెప్ట్ తో చేస్తున్నప్పుడు రిస్క్ ఎందుకు.చెట్టుని పెళ్లి చేసుకోవడం, కుక్కను పెళ్లి చేసుకోవడం అనేది ఇప్పటికీ ఉంది.సెలబ్రిటీలు చెట్టుని పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇందులో చెట్టుకి పెళ్లంటే పెద్ద తాళిబొట్టు కావాలని భావించి.. కుక్కను పెళ్లి చేస్కోమని హీరోకి వాళ్ళ ఫ్రెండ్ చెబుతాడు. పైగా కుక్కని నేషనల్ యానిమల్ అంటాడు. ఆ తర్వాత అసలు ఫన్ మొదలవుతుంది.

ప్ర) ఈ సినిమా ట్రైలర్ అల్లు అర్జున్ కి బాగా నచ్చిందని మీ అబ్బాయి చెప్పారు..!

బ్రహ్మాజీ : ‘పుష్ప పార్ట్ 2’ షూటింగ్‌లో ఉన్నప్పుడు.. నైట్ షూట్లో బన్నీ ట్రైలర్ చూసి ‘బాగుంది’..అన్నారు. ఆ తర్వాత అందరినీ చూడమన్నారు.

ప్ర) సెకండ్ హాఫ్ లో ఎక్కువగా కోర్టు డ్రామా ఉందట కదా?

బ్రహ్మాజీ : అవును.. అయినా బోర్ కొట్టదు. సప్తగిరి నాకు మంచి ఫ్రెండ్. ఈ సినిమాలో మా ఇద్దరి కామెడీ సీన్స్ పోటాపోటీగా ఉంటాయి. పైగా జడ్జిగా ఫిష్ వెంకట్ చేశాడు. వినగానే హిలేరియస్ గా అనిపించింది. అతని ఎంట్రీ కూడా అదే రేంజ్ లో ఫన్ తో కూడి ఉంటుంది.

ప్ర) బ్రో సినిమా పక్కనే రిలీజ్ అవ్వడం రిస్క్ అనిపించలేదా?

బ్రహ్మాజీ : నిజానికి ఇది రిస్క్ కాదు. సేఫ్ గేమ్.మొదట జూలై 21న విడుదల చేయాలని అనుకున్నాం. కానీ ఆ టైంలో సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యాయి. అవి రకరకాల జోనర్ల సినిమాలు. అప్పుడు మా సినిమా ఆనదు.అందుకే జూలై 29న ఫిక్స్ అయ్యాం. జూలై 28న ‘బ్రో’ రిలీజ్ అవుతుంది. ‘బ్రో’ సినిమాకి టికెట్లు దొరక్కపోతే మా సినిమాకే వస్తారు కదా. (నవ్వుతూ).

ప్ర) అది శేఖర్ కమ్ముల గారి స్ట్రాటజీనా?

బ్రహ్మాజీ : శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సినిమా వచ్చినప్పుడు శేఖర్ కమ్ముల గారు అదే చేశారని విన్నాం. కానీ మాకు నిర్మాతలు,డిస్ట్రిబ్యూటర్లు చెప్పిన మాట ఇది.

ప్ర) మొదట ఈ సినిమాకి ‘కుక్క మొగుడు’ అనే టైటిల్ పెట్టారట కదా?

బ్రహ్మాజీ : నిజమే..!ఈ కథని ఆర్జీవీ గారికి వినిపిస్తే.. ‘కుక్క మొగుడు’ అని టైటిల్ పెట్టమని అన్నారట. కానీ అది సౌండింగ్ బాలేదు అని భావించి… నిర్మాతలు ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ అని పెడితేనే బాగుంటుందని అన్నారు.

ప్ర) మీ 37 ఏళ్ళ సినీ కెరీర్లో కాల్ షీట్లు బిజీగా ఉండి మిస్ చేసుకున్న మంచి పాత్రలు ఏమైనా ఉన్నాయా?

బ్రహ్మాజీ : అలాంటివి పెద్దగా ఏమీ లేవు. ఒకవేళ ఓ సినిమాలో నాకు నచ్చిన పాత్ర మిస్ అయితే. నెక్స్ట్ సినిమాలో అలాంటి పాత్ర దొరికేస్తుంది.

ప్ర) మీ అబ్బాయి సినిమాల్లో మిస్ కాకుండా నటిస్తున్నారు. అన్నీ దగ్గరుండి చూసుకోవాలనేనా?

బ్రహ్మాజీ : వాస్తవానికి.. ‘ఓ పిట్ట కథ’ లో కానీ ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ లో కానీ నేను నటించాలి అనుకోలేదు. నేను నటిస్తే సంజయ్ ఇబ్బంది పడతాడేమో అని నా భయం. కానీ ఆ పాత్రలకి మేకర్స్ నన్నే అనుకున్నారు. కాబట్టి చేస్తున్నాను. ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ లో మొదట నా పాత్రకి సప్తగిరిని అనుకున్నారు. తర్వాత అతన్ని వేరే పాత్రకి మార్చి నన్ను నా పాత్రలో పెట్టారు(నవ్వుతూ)

ప్ర) ‘ఓ పిట్ట కథ’ ని చిరంజీవి గారు, మహేష్ గారు ప్రమోట్ చేశారు.. మీకున్న సర్కిల్ మీ అబ్బాయికి అలా కలిసొస్తుంది అనుకోవచ్చా?

బ్రహ్మాజీ : నా (Brahmaji) 37 ఏళ్ళ సినీ జీవితంలో నేను సంపాదించుకున్న ఆస్తి అది. చిరంజీవి గారు, మహేష్, చరణ్.. ఇంకా చాలా మంది సీనియర్ హీరోలు నాకు అత్యంత సన్నిహితులుగా ఉండటం అనేది నా అదృష్టంగా కూడా నేను భావిస్తున్నాను.

ప్ర) ‘పుష్ప 2’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అలాగే ‘పుష్ప 2’ సినిమా ఎలా ఉండబోతుంది?

బ్రహ్మాజీ : ‘పుష్ప 2’ మొదటి పార్ట్ కి అమ్మ మొగుడిలా ఉంటుంది. అదిరిపోతుంది. ఫాహద్ ఫాజిల్ పక్కనే ఉండే పాత్ర నాది.

ప్ర) ‘సలార్’ లో కూడా నటిస్తున్నారు అని విన్నాం?

బ్రహ్మాజీ : అవును ‘సలార్’ లో ఓ కొత్త తరహా పాత్ర చేస్తున్నాను. మొదటి పార్ట్ లో కంటే కూడా రెండో పార్ట్ లో ఎక్కువ కనిపిస్తాను.

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

బ్రహ్మాజీ : మహేష్ బాబు ‘గుంటూరు కారం’, ప్రభాస్ ‘సలార్’, బాలకృష్ణ గారి ‘భగవంత్ కేసరి’, సందీప్ కిషన్ ‘ఊరి పేరు భైరవకోన’, నాగ శౌర్యతో ఓ సినిమా. ఇలా చాలా ఉన్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Brahamaji
  • #Brahamaji
  • #Brahmaji
  • #Slumdog Husband

Also Read

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

related news

trending news

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Mana ShankaraVaraPrasad Garu Review in Telugu: మన శంకరవరప్రసాద్ గారు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

17 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

2 days ago
Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

2 days ago
Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

2 days ago

latest news

Mana ShankaraVaraPrasad Garu Twitter Review: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ట్విట్టర్ టాక్ ఇదే!

Mana ShankaraVaraPrasad Garu Twitter Review: మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో చిరు కంబ్యాక్ ఇచ్చినట్టేనా? ట్విట్టర్ టాక్ ఇదే!

11 hours ago
Prabhas, Krishna Kanth: ప్రభాస్‌ సినిమాల్లో కచ్చితంగా ఓ పాట.. ఎందుకో చెప్పిన లిరిక్‌ రైటర్‌

Prabhas, Krishna Kanth: ప్రభాస్‌ సినిమాల్లో కచ్చితంగా ఓ పాట.. ఎందుకో చెప్పిన లిరిక్‌ రైటర్‌

17 hours ago
Nache Nache: ‘నాచే నాచే’ కాపీ ట్యూన్.. చెప్పు చూపించిన ఒరిజినల్‌ కంపోజర్‌

Nache Nache: ‘నాచే నాచే’ కాపీ ట్యూన్.. చెప్పు చూపించిన ఒరిజినల్‌ కంపోజర్‌

17 hours ago
Nari Nari Naduma Murari: ‘సామజవరగమన’ లాంటి పాయింట్‌ ఇందులోనూ ఉందట.. ఏంటబ్బా?

Nari Nari Naduma Murari: ‘సామజవరగమన’ లాంటి పాయింట్‌ ఇందులోనూ ఉందట.. ఏంటబ్బా?

17 hours ago
Ashika Ranganath: రెండు పాత్రలూ ఆఫర్‌ చేశారు.. ‘నైఫ్‌’ ఎందుకు ఎంచుకున్నానంటే: ఆషికా

Ashika Ranganath: రెండు పాత్రలూ ఆఫర్‌ చేశారు.. ‘నైఫ్‌’ ఎందుకు ఎంచుకున్నానంటే: ఆషికా

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version