బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో ‘బాపు’ అనే సినిమా రూపొందింది. దీని ప్రమోషన్స్ లో భాగంగా.. పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో బ్రహ్మాజీ.. సీనియర్ స్టార్ కమెడియన్ అయినటువంటి బ్రహ్మానందం సెటైర్లు విసిరాడు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్…”ఇటీవల బ్రహ్మానందం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. “నేను సినిమాలు తక్కువ చేయడానికి కారణం.. నాకు ఆఫర్లు రాక కాదు. చేసిన పాత్రలే మళ్ళీ మళ్ళీ చేస్తున్నానేమో అనే ఫీలింగ్ రావడం వల్ల సెలక్టివ్ గా చేస్తున్నాను.
అయితే చిన్న చిన్న పాత్రలే ఎందుకు చేస్తున్నాను.. అంటే యువ దర్శకులు నన్ను ‘దృష్టిలో పెట్టుకుని పాత్రలు రాశాము. చిన్న సీన్లే. మిమ్మల్ని డైరెక్ట్ చేశాము అనే తృప్తి కోసం చేయండి’ అని అడుగుతున్నారు. అందుకు కాదనలేక చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చారు. మీరు కూడా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమాలు తగ్గించారు. మీరు కూడా అదే పద్దతిని ఫాలో అవుతున్నారా?” అంటూ ప్రశ్నించాడు.
అందుకు బ్రహ్మాజీ.. ” బ్రహ్మానందం గారు వేరు. ఆయన 1500 సినిమాలు చేశాడు. మేము ఆయనతో పోల్చుకోకూడదు. ఆయన వెల్ సెటిల్డ్. ఆయనకు పోయిందేముంది. ఏదైనా చెబుతాడు. ఆయన మహానుభావుడు. కోట్లు సంపాదించుకున్నాడు. ఆయనకు అవసరం లేదు సినిమాలు. కాకపోతే కాలక్షేపంగా అయినా చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఏం కూర్చుంటాములే అని. అంతే తప్ప..! ఆయన చేయని పాత్ర లేదు. వేరియేషన్ లేదు.
ఆయన చేసిన దాంట్లో 10 శాతం కామెడీ అనుకుని చేస్తున్నాం అంతే. సో ఆయన స్టేట్మెంట్లు బాగానే ఇస్తాడు. మేము వాటిని ఫాలో అవ్వకూడదు. ప్రపంచంలో ఉన్న రోల్స్ అన్నీ చేసేసినప్పుడు ఆయనకు రిపీటెడ్ వస్తాయి.” అంటూ ఓ పక్క పోగుతున్నట్టే పొగిడి.. చురకలు అంటించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.