పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సాంప్రదాయ పండుగల పట్ల తన ఆసక్తిని మరోసారి చాటుకున్నారు. ఈసారి ఆయన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా సందర్బంగా సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్‌తో కలిసి పుణ్యస్నానం చేశారు. ఈ ఆధ్యాత్మిక యాత్రలో త్రివిక్రమ్ కూడా పవన్ కుటుంబానికి తోడయ్యారు. పవన్ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అభిమానులకు గర్వకారణంగా మారింది. అయితే, పవన్ పుణ్యస్నానం చేసే సమయంలో చొక్కా విప్పిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అందులో ఆయన బాడీని చూసిన కొందరు నెటిజన్లు ఫిట్‌నెస్ గురించి కామెంట్లు మొదలు పెట్టారు. ఇదేనా పవర్ స్టార్ బాడీ?, ‘ఇంకా జిమ్ చెయ్యలేదా? అంటూ ట్రోలింగ్ ప్రారంభమైంది. మరోవైపు పవన్ అభిమానులు మాత్రం ఈ విమర్శలపై గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కేవలం హీరో కాదు, ఏపీ ఉపముఖ్యమంత్రి కూడా. ఆయనకు రెగ్యులర్ ఫిట్‌నెస్ మెయింటైన్ చేయడానికి తగిన సమయం లేకపోవచ్చు. రాజకీయాలకోసం నిరంతరం పర్యటనలు, సమయానికి ఆహారం లేకపోవడం, ఒత్తిడి..
ఇవన్నీ శరీరంపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను బాడీ షేమింగ్ చేయడం ఎంతవరకు సమంజసమనే చర్చ మొదలైంది. ఫ్యాన్స్ అభిప్రాయం ప్రకారం, పవన్ లాంటి వ్యక్తి ఆధ్యాత్మికతను ప్రదర్శిస్తూ, కుటుంబంతో కలిసి పుణ్యస్నానం ఆచరించడం పాజిటివ్ విషయం. అలాంటి సందర్భంలో ఫిజిక్ గురించి ట్రోల్స్ చేయడం అవసరమా? సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు హీరోలు బాడీ కేర్ తీసుకుంటారు.
కానీ, పవన్ జీవితమంతా సినిమాలకు పరిమితం కాదు కదా. మొత్తానికి, పవన్ ఫిజిక్‌పై నెగటివ్ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. కానీ, ఆయన్ని అభిమానించే వారికైతే ఇవన్నీ చిన్న విషయాలే. పవన్ చేసే సినిమాలు, రాజకీయాల్లోని సేవలు, సమాజం పట్ల ఆయన కట్టుబాటు ఇవి అన్ని బాడీ షేమింగ్ కంటే ఎక్కువ విలువైనవని వారు స్పష్టం చేస్తున్నారు. అలాగే ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఆ రేంజ్ తగ్గదని అంటున్నారు.