రవిబాబు చేతుల మీదుగా చలపతిరావు అంత్యక్రియలు పూర్తి!

సీనియర్ నటుడు చలపతిరావు ఈనెల 24వ తేదీ గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే. అప్పటివరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నటువంటి ఈయన ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మరణించారు.ఇక చలపతిరావు మరణ వార్త తెలుసుకున్నటువంటి సినీ సెలబ్రిటీలు ఆయన చివరి చూపు కోసం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇక కుమారుడు రవిబాబు ఇక్కడే ఉన్నప్పటికీ తన కుమార్తెలు మాత్రం అమెరికాలో ఉండటం వల్ల వాళ్లు వచ్చిన తర్వాత చలపతిరావు అంత్యక్రియలు జరుగుతాయని రవిబాబు వెల్లడించారు.

ఈ క్రమంలోనే చలపతిరావు కుమార్తెలు అమెరికా నుంచి రావడం ఆలస్యమైన సందర్భంగా చలపతిరావు పార్థివ దేహాన్ని మహాప్రస్థానంలోని ఫ్రీజర్ లో ఉంచారు. ఇక చలపతిరావు కుమార్తెలు అమెరికా నుంచి రావడంతో నేడు ఉదయం ఈయన అంత్యక్రియలను పూర్తి చేశారు. మహాప్రస్థానంలోనే ఈయన అంత్యక్రియలను హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం రవిబాబు చేతుల మీదుగా నిర్వహించారు. సంప్రదాయపద్ధంగా చలపతిరావు అంత్యక్రియలను పూర్తి చేశారు.

చలపతిరావు అంత్యక్రియలలో భాగంగా అభిమానులతో పాటు మంచు మనోజ్, సురేష్ బాబు, దామోదర్ ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, బోయపాటి శ్రీను, శ్రీ వాసవ్, నటుడు గౌతమ్ వంటి పలువురు ఈయన అంత్యక్రియలలో పాల్గొన్నారు.ఇండస్ట్రీకి సుమారు 50 సంవత్సరాలకు పైగా తన సేవలను అందించి సుమారు 1200 సినిమాలలో నటించిన చలపతిరావు కళామతల్లి నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus