Chandra Mohan: తన కూతుర్ల వల్ల చంద్రమోహన్ రూ.100 కోట్లు పోగొట్టుకోవాల్సి వచ్చిందట..!

సీనియర్ నటుడు చంద్రమోహన్..అప్పట్లో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారు అన్న సంగతి ఎక్కువ మందికి తెలిసుండదు. ముఖ్యంగా చంద్రమోహన్ కు జోడీగా నటించిన హీరోయిన్లు స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈయనకు హైట్ మైనస్ అవ్వడం వల్ల… క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిర పడాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈయన బిజీ ఆర్టిస్ట్ గానే రాణించారు. ఇదిలా ఉండగా.. చంద్రమోహన్ తన కూతుర్ల వల్ల రూ.100 కోట్లు పైనే పోగొట్టుకున్నారట.

వాళ్ళు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది లేదు అయినా వాళ్ళ వలన చంద్రమోహన్ ఎలా పోగొట్టుకున్నారు? అనే ప్రశ్న అందరిలో మెదులుతుంటుంది. అది ఎలా అంటే.. అప్పట్లో స్టార్ హీరో శోభన్ బాబు గారు తన సంపాదన అంతా భూమి పై పెట్టేవారట. తాను మాత్రమే కాదు తన స్నేహితులైన మురళీ మోహన్, చంద్రమోహన్ లకు కూడా భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ బిజినెస్ గురించి చెప్పి వాళ్ళతో కూడా భూములు కొనిపించారట.

శోభన్ బాబు ఫ్యామిలీ ఈరోజు ఎటువంటి లోటు లేకుండా హ్యాపీగా జీవిస్తుంది అంటే అదే కారణం. అలాగే మురళీమోహన్ కూడా చేసేవారు. మురళీమోహన్ కూడా టాలీవుడ్లో ఉన్న నటుల్లో రిచెస్ట్ పర్సన్ అయ్యారు అంటే అదే కారణం.చంద్రమోహన్ కూడా వీరి బాటలోనే భూములు కొన్నారు. కానీ తనకి ఇద్దరూ కుతుళ్ళే కావడం వల్ల… అందులోనే వాళ్ళు కూడా విదేశాల్లో స్థిరపడడం వల్ల తమ ఆస్తులను చూసుకోవడం కష్టమయ్యేదని భావించి.. హైదరాబాద్ సిటీలో ఆయనకున్న 20 ఎకరాల ల్యాండ్ ను అప్పట్లో తక్కువ ధరకు అమ్ముకున్నట్లు చంద్రమోహన్ చెప్పారు.

ముఖ్యంగా శంషాబాద్ లో రోడ్డు పక్కనే ఉన్న 15 ఎకరాల ల్యాండ్ ను లిటికేషన్స్ వల్ల ఆ రోజుల్లో లక్షల్లోనే అమ్ముకున్నారట. వాటి విలువ ఇప్పుడు రూ.100 కోట్లకు పైనే ఉంటుంది అని చంద్రమోహన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తనకు అబ్బాయిలు ఉన్నా.. లేదంటే తన కూతుర్లు తమ ఫ్యామిలీస్ తో కలిసి ఇండియాలోనే ఉన్నా ఆ భూమిని అమ్మే ఆలోచన ఆయనకు వచ్చేది కాదని ఆయన అన్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus