మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. 1,000 లోపే ఓట్లు ఉన్న ‘మా’ ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రముఖ సీనియర్ నటుడు సీవీఎల్ నరసింహారావు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. విభిన్నమైన పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సీవీఎల్ నరసింహారావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో దిగుతున్నానని ప్రకటన చేశారు. మూవీ ఆర్టిస్ట్ సభ్యుల సంక్షేమం కొరకు అన్ని విధాలుగా కృషి చేస్తానని తన ప్యానల్ తెలంగాణ వాదమని సినిమా అవకాశాల విషయంలో తెలుగు వారికి న్యాయం జరగాలని నరసింహారావు పేర్కొన్నారు.
ఇప్పటికే మా అధ్యక్ష బరిలో ఉన్న నలుగురు సినీ ప్రముఖులకు నరసింహారావు షాకిచ్చారనే చెప్పాలి. భవిష్యత్తులో మరి కొందరు నటులు అధ్యక్ష పదవికి పోటీ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎక్కువమంది పోటీ చేస్తున్న నేపథ్యంలో గతంలో జరిగిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలు భిన్నంగా జరగనున్నాయి. మరోవైపు అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తున్నట్టు మంచు విష్ణు ప్రకటన చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం తన కుటుంబం తరపున ఇస్తానని మంచు విష్ణు పేర్కొన్నారు.
ప్రకాష్ రాజ్ సైతం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు భవనం కోసం కృషి చేస్తానని చెప్పారు. ‘మా’ ఎన్నికలకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ముందు ముందు పోటీ చేస్తామని ప్రకటించిన వారిలో ఒకరిద్దరు తప్పుకుని ఇతరులకు మద్దతు ప్రకటించే అవకాశాలు సైతం ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!