Dhanraj, Chanti: బిగ్ బాస్ టాప్4 వాళ్లేనంటున్న జబర్దస్త్ ధనరాజ్!

జబర్దస్త్ షో ద్వారా, సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో ధనరాజ్ ఒకరు. జబర్దస్త్ షోలో స్కిట్లు చేసిన సమయంలో కొన్నిసార్లు నెగిటివ్ కామెంట్లు వచ్చాయని ధనరాజ్ తెలిపారు. 100 మంది ఉంటే అందరికీ మనం నచ్చము అని ధనరాజ్ అన్నారు. మనం పొగడ్తలు తీసుకున్న సమయంలో తిట్లు కూడా తీసుకోవాలని ధనరాజ్ వెల్లడించారు. ఒక స్కిట్ ఏవీఎస్ గారిని స్పూర్తిగా తీసుకుని ఆయనకు క్రెడిట్స్ ఇచ్చానని ధనరాజ్ అన్నారు.

వేణు వివాదంలో చిక్కుకున్న సమయంలో అతడిని కొట్టారని కొడితే ఏమొస్తుందని ధనరాజ్ తెలిపారు. అప్పుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు వేణు తరపున ఒక లాయర్ ను పెట్టారని ధనరాజ్ చెప్పుకొచ్చారు. జై సినిమా సమయంలో వేణు పరిచయమయ్యాడని చంటి కూడా నాకు బాగా క్లోజ్ అని ధనరాజ్ తెలిపారు. జబర్దస్త్ 13 ఎపిసోడ్ల తర్వాత అందరం బయటికి వెళ్లాలని అనుకున్నామని ధనరాజ్ అన్నారు. షూటింగ్స్ ఉన్న సమయంలో చలాకీ చంటి జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లేవాడని ధనరాజ్ తెలిపారు.

జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిన సమయంలో చలాకీ చంటిని ఎవరో ఒకరు బ్రతిమలాడాలని అలా బ్రతిమలాడితే ఆయన వెనక్కు వస్తారని ధనరాజ్ అన్నారు. బిగ్ బాస్ గేమ్ షోలో ఎవరు ఏ స్థానాలలో ఉంటారో అంచనా వెయ్యలేమని ఒక్కరోజులో పొజిషన్స్ మారిపోతాయని ధనరాజ్ చెప్పుకొచ్చారు. టాప్4 లో రేవంత్, సుదీప, శ్రీహాన్, గీతూ రాయల్ ఉంటారని భావిస్తున్నానని ధనరాజ్ వెల్లడించారు.

కొడుకు పుట్టడం హ్యాపీయెస్ట్ మూవ్ మెంట్ అని ధనరాజ్ చెప్పుకొచ్చారు. లైఫ్ లో ఏదైనా మార్చుకోగలిగే అవకాశం వస్తే సినిమా ప్రొడ్యూస్ చేసేవాడిని కాదని సినిమాలలో హీరోగా నటించేవాడిని కాదని మా మదర్ క్యాన్సర్ తో చనిపోయారని ముందే తెలిసి ఉంటే అలా జరగకుండా నా వంతు ప్రయత్నం చేసేవాడినని ధనరాజ్ కామెంట్లు చేశారు. ధనరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus