నటుడి బ్యాగ్ లో బుల్లెట్లు..!

పోకిరి (Pokiri) సినిమాలో బుల్లెట్ సీన్ గుర్తుందా? ఒక సీన్లో పోలీస్ అయినటువంటి ఆశీష్ విద్యార్ది (Ashish Vidyarthi).. బాస్కెట్ బాల్ ఆడుకుంటున్న హీరో మహేష్ బాబుకు (Mahesh Babu) వార్నింగ్ ఇవ్వాలని వెళ్తాడు. అయితే హీరో రివర్స్ లో అతనికి షాక్ ఇస్తూ ‘ గన్ దొరికింది అని చెప్పాను కదా .. అది నాదే..! బుల్లెట్లు కూడా నా దగ్గరే ఉన్నాయి. ‘ అంటూ చెప్పి బుల్లెట్లు చూపిస్తాడు. ఇలాంటిది నిజజీవితంలో ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

వివరాల్లోకి వెళితే.. తమిళ సీనియర్ నటుడు, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కరుణాస్ బ్యాగ్ లో బుల్లెట్లు దొరకడం పెద్ద చర్చకి దారి తీసింది. ఆదివారం నాడు చెన్నైలోని ఎయిర్పోర్ట్ లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. విమానాశ్రయంలోని తనిఖీ చేస్తున్న టైమ్ లో కరుణాస్ బ్యాగ్ లో దాదాపు 40 బుల్లెట్ లు లభించాయట. దీని పై అధికారులు కరుణాస్ ను ప్రశ్నించగా..

అవి తన లైసెన్స్ రివాల్వర్ కి సంబంధించినవని, ఎయిర్పోర్ట్ కి వచ్చే తొందరలో అవి ఉన్నట్టు చేసుకోలేదు అని అసలు విషయం చెప్పారట. అలాగే ఆ రివాల్వర్ కి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా అధికారులకి కరుణాస్ చూపించారట. అయినప్పటికీ కూడా ఆ బ్యాగ్ తో లోపలికి వెళ్లేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదట. కానీ పోలీస్ కంప్లయింట్ వంటివి లేకుండా కరుణాస్ ను బయటకి పంపించేసినట్టు సమాచారం. కరుణాస్ కూడా వారితో ఎక్కువ వాదించకుండా బయటకి వెళ్లిపోయారు అని తెలుస్తుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus