సినీ పరిశ్రమలో మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.కమెడియన్ అల్లు రమేశ్ మరణించి 4 రోజులు కూడా కాకుండానే నిన్న నిండా పాతికేళ్ళు కూడా నిండని కొరియన్ పాప్ సింగర్, అలాగే నటుడు అయిన మూన్ బిన్ మరణించాడు. అలాగే బాలీవుడ్ స్టార్ నిర్మాత, దర్శకుడు అయిన యష్ చోప్రా భార్య అలాగే సింగర్, ప్రొడ్యూసర్ పమేలా చోప్రా కూడా కన్నుమూసింది. అలాగే టాలీవుడ్ నిర్మాత చెర్రీ (చిరంజీవి) తల్లి కూడా అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది.
వీటితో ఇండస్ట్రీ మొత్తం షాక్ లోకి వెళ్లిపోగా.. తాజాగా స్టార్ హీరో మమ్ముట్టి (Mammootty) ఇంట్లో కూడా విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మలయాళం మెగాస్టార్ గా పేరొందిన మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఆమె వయసు 93 ఏళ్ళు. వయసు సంబంధిత సమస్యలతో ఆమె సతమతమవుతూ వస్తున్న ఆమె పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఉండగా కన్నుమూసినట్టు తెలుస్తుంది.
ఆమెకు మమ్ముట్టితో పాటు ఐదుగురు సంతానం ఉన్నారు. కొచ్చికి సమీపంలోని చెంబు గ్రామంలో ఆమె జీవిస్తూ వచ్చారు. ఇక ఆమె భౌతిక ఖాయాన్ని సందర్శించేందుకు అనేక మంది మలయాళం సెలబ్రిటీలు మమ్ముట్టి ఇంటికి వెళ్తున్నారు. చెంబు ముస్లిం జమాత్ మస్జిదులో సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక మమ్ముట్టి నటించిన ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28 న విడుదల కాబోతోంది. తెలుగులో ఈయన నటించిన 4 వ చిత్రమిది.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!