సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య తగ్గడం లేదు. ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు మరణించడం జరిగింది. కొందరు అనారోగ్య సమస్యలతో, ఇంకొందరు వయసు సంబంధిత సమస్యలతో మరణించారు.ఇంకొంతమంది అయితే గుండెపోటుతో మరణించారు. మొన్నటికి మొన్న కన్నడ నటుడు నితిన్ గోపి కూడా గుండె పోటుతో మరణించడం జరిగింది. అలాగే దర్శకుడు వెట్రిమారన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న శరన్ రాజ్ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.
ఈ వార్త నుండీ ఇంకా జనాలు కోలుకోకముందే మరో (Actor) నటుడు క్యాన్సర్ తో మరణించడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు మంగళ్ ధిల్లాన్ కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు . కొన్నాళ్లుగా పంజాబ్ లోని లుథియాలనా ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే,ఇప్పుడు పరిస్థితి విషమించడంతో మంగళ్ ధిల్లాన్ కన్నుమూసినట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఆదివారం నాడు ఆస్పత్రిలో ఆయన కన్నమూసినట్టు తెలుస్తుంది.
ఆయన మరణ వార్తతో బాలీవుడ్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. సినీ ప్రముఖులు, ఆయన నటనను ఇష్టపడేవారు ఆయన మృతికి చింతిస్తూ తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. మంగళ్ ధిల్లాన్ 1980 వ సంవత్సరంలో ‘కథాసాగర్’ అనే టీవీ షో ద్వారా కెరీర్ ను మొదలుపెట్టారు. అలా ఏర్పడ్డ క్రేజ్ తో సీరియల్స్ లోకి అడుగుపెట్టి సత్తా చాటారు. అటు సినిమాల్లో కూడా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. బాలీవుడ్ సినీ పరిశ్రమ ఓ గొప్ప నటుడిని కోల్పోయిందనే చెప్పాలి.
టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!