Nandu, Geetha Madhuri: క్యాసినో ఆడి గీత డబ్బులు పోగొట్టుకుంది: నందు

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి వారిలో నటుడు నందు ఒకరు గీత మాధురి భర్తగా కూడా ఈయన అందరికీ ఎంతో సుపరిచితమే అయితే ఈయన ప్రస్తుతం వధువు అనే వెబ్ సిరీస్ లో నటించారు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమాలలో ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గతంలో గీతామాధురి క్యాసినో ఆడి భారీ స్థాయిలో డబ్బులు పోగొట్టుకుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. ఈ విషయం గురించి నందు మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. ఒకసారి నేను గీత ఇద్దరం కూడా లండన్ వెళ్ళాము అక్కడ తను క్యాసినో ఆడటం నేర్చుకుంది. తను చాలా తెలివైన అమ్మాయి కానీ అక్కడ భారీగానే డబ్బు పోగొట్టుకుందని తెలిపారు.

మరోసారి న్యూజిలాండ్ కాలిఫోర్నియాలో కూడా ఆడింది ఈసారి డబ్బులు వస్తాయి ఏమోనని బాగా ఆసక్తిగా ఆడిందని నాకు మాత్రం విసుగు వచ్చి అక్కడున్న డబ్బులన్నీ విసిరేసి వెళ్లిపోతానని బయటకు వచ్చాను ఇక తాను కూడా బయటకు వచ్చింది. ఇలా ఇద్దరం మేము గొడవ పడటంతో పోలీసులు నేను ఆ అమ్మాయిని వేధిస్తున్నానని పెద్ద గొడవ చేశారని నేను తన నా భార్య అని వారికి అర్థమయ్యేలా చెప్పి అక్కడి నుంచి తప్పించుకున్నామని తెలిపారు.

ఇక తాను ఇప్పటికీ కూడా ఈ గేమ్ ఆడుతూ ఉంటుందని అయితే లక్షల్లో కాకుండా 5000, 10000 డబ్బు పెడుతూ ఈ ఆట ఆడుతూ ఉంటుందని ఈ సందర్భంగా తన భార్య గీతమాధురికి ఉన్నటువంటి క్యాసినో పిచ్చి గురించి నందు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే తన విడాకులు వార్తలపై స్పందించి మేమిద్దరం విడిపోలేదని ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాము అంటూ కూడా ఈయన (Nandu) స్పష్టత ఇచ్చారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus