Naresh: రాజీపడి సినిమాలు చేయను! విలన్‌గా నటించాలి: నరేశ్‌

స్క్రీన్‌పైనే కాదు.. నిజ జీవితంలోనూ సాహసాలకు ముందుంటా. మనసుకు నచ్చింది చేస్తా తప్ప రాజీ పడి సినిమాలు చేయను అంటున్నారు ప్రముఖ నటుడు నరేశ్‌. నటుడిగా కెరీర్‌ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారాయన. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ కెరీర్‌ గురించి, మా అధ్యక్ష భవనం గురించి, నంది అవార్డులు తదితర అంశాల గురించి మాట్లాడారు. అందులో ఆయన చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి. కెరీర్‌ నిలకడగా ముందుకు తీసుకెళ్లడమే ప్రధానం. అందుకే నటుడిగా ఎంత సంపాదించాననే విషయాన్ని దృష్టిలో పెట్టుకోను. 9 ఏళ్ల వయసులో ‘పండంటి కాపురం’ సినిమాతో బాల నటుడిగా తెరపై కనిపించిన ఆయన…

ఆ తర్వాత హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేశారు. అయితే ప్రతి పాత్రకు కొత్తదనం ఉండేలా చూసుకున్నారాయన. అందుకే ఇన్నాళ్లు ఇండస్ట్రీలో కొనసాగలుగుతున్నారు. కథ, పాత్ర నచ్చితే చాలు, పారితోషికం గురించి ఎప్పుడూ ఆలోచించను అని చెప్పారు నరేశ్‌. అందుకే ఓ వైపు పెద్ద బ్యానర్స్‌లో పని చేస్తూనే, మరోవైపు మంచి పాత్రలు దొరికినప్పుడు కొత్తవాళ్లు చేస్తున్న చిన్న బడ్జెట్‌ చిత్రాల్లోనూ నటిస్తున్నా అని తెలిపారు. నేను అనుకున్న సినిమాలు చేయలేకపోతున్నాననే నిరాశతోనే తన తొలి ఇన్నింగ్స్‌ ముగిసిందని, అయితే రెండో ఇన్నింగ్స్‌తో ఆ లోటు తీరిందని చెప్పారు.

ఒకప్పుడు సేవాభావంతో రాజకీయాల్లోకి వెళ్లానని, ఇప్పుడు రాజకీయాల్లో మార్పులొచ్చాయని, ప్రస్తుత పరిస్థితిలో సినిమాలు పక్కకు పెట్టి మళ్లీ పాలిటిక్స్‌ వైపు వెళ్లడం సరికాదు అని అనుకుంటున్నట్లు నరేశ్ వివరించారు. అలాగే నంది అవార్డుల గురించి మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా సినీ పరిశ్రమకు తగిన గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. నంది అవార్డుల్ని పరిశ్రమ గౌరవంగా చూస్తుంది. కానీ ఇప్పుడా అవార్డుల్ని ఇవ్వడం లేదు. నంది అవార్డుల్ని పునర్‌ ప్రారంభించాలని ప్రభుత్వాల్ని కోరుతున్నా అని అన్నారు.

ఫైనల్‌గా మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) భవనం గురించి ప్రస్తావించారు. ‘మా’ బిల్డింగ్‌ను ఫిల్మ్‌ ఛాంబర్లో ఏర్పాటు చేయాలా లేక ప్రత్యేక భవనం నిర్మించాలా అనే విషయంలో పురోగతి ఆగింది అని తెలిపారు. అందరి నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందకెళ్దాం అని మంచు విష్ణు అన్నారు. అవసరమనుకుంటే నార్సింగ్‌లో తన సొంత ఖర్చుతో ‘మా’ భవనం నిర్మించడానికి సిద్ధమని విస్ణు చెప్పారు. అయితే ఎలాంటి తప్పు జరగకుండా జాగ్రత్తగా ముందుకెళ్లాలన్నది తమ ఉద్దేశమని క్లారిటీ ఇచ్చారు (Naresh) నరేశ్‌.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus