Naresh: ఆస్తి కోసమే కొందరు నా జీవితంలోకి వచ్చారు: నరేష్

సీనియర్ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ వీరి వ్యవహారం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిన వీరిద్దరూ ఓ సినిమాలో కలిసి నటించారు. అయితే ఈ సినిమా సమయంలోనే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడటం అనంతరం ఇద్దరు వారి నిర్ణయం మేరకే రిలేషన్ లో ఉండడం జరుగుతుంది. ఇలా పవిత్ర లోకేష్ నరేష్ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అనే సినిమాని ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్ ఒక కార్యక్రమాలలో భాగంగా నరేష్ తన ఆస్తుల గురించి బయటపెట్టారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ అవును తాను ఒక బిలీనియర్ అని తనకు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని ఒప్పుకున్నారు. వారసత్వంగా వచ్చిన ఆస్తి కొంత అయితే తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి మరి కొంత ఉందని నరేష్ తెలిపారు.

అయినా అదంతా కూడా వైట్ మనీనే బ్లాక్ మనీ కాదని ఈయన (Naresh) కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇక చాలామంది నా డబ్బు ఆశ చూసి నాతో ఉండాలని వచ్చారు మరికొందరు వెళ్ళిపోయారు కానీ పవిత్ర మాత్రం అలా కాదు మాది నిజమైన పవిత్ర బంధం అంటూ ఈయన పవిత్రతో తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి కూడా తెలిపారు.ఇక చాలామంది పవిత్ర కేవలం నా డబ్బు ఆస్తులు చూసి మాత్రమే తనతో ఉంటుందంటున్నారు.

ఇందులో నిజం లేదని తెలియజేశారు. ఇక ఈ విషయం గురించి పవిత్ర కూడా మాట్లాడుతూ ఇప్పటికే మా ఇద్దరికీ పెళ్లి జరిగిన ఫీలింగ్ ఉంది నరేష్ ఇకపైఎవరిని చూడరు చివరి వరకు మా బంధం ఇలాగే ఉంటుంది అంటూ పవిత్ర సైతం తమ బంధం గురించి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus